Breaking News

పుతిన్‌-మోదీ భేటీ వేళ.. జెలెన్‌స్కీకి ఫోన్‌కాల్‌

Published on Sat, 08/30/2025 - 21:34

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌ వేదికగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ భేటీ కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌ శాంతి చర్చల అంశంపై ఈ ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

కీవ్‌పై మాస్కో దాడుల ఉధృతమైన నేపథ్యంలో.. తాజా పరిస్థితులు, మానవతా అంశాలు, శాంతి స్థాపన ప్రయత్నాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశ వివరాలను జెలెన్‌స్కీ మోదీకి వివరించారు. అలాగే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు.

‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడితో జరిగిన చర్చలో యుద్ధ పరిస్థితి, మానవతా అంశాలు, శాంతి స్థాపన ప్రయత్నాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్ శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అని భారత ప్రధాని, జెలెన్‌స్కీతో ఫోన్‌కాల్‌ సారాంశాన్ని వెల్లడించారు. మరోవైపు.. జెలెన్‌స్కీ కూడా సంభాషణను ఉపయోగకరమైన, ముఖ్యమైన చర్చగా అభివర్ణించారు. 

అలస్కాలో ట్రంప్‌-పుతిన్‌ సమావేశం జరిగినప్పటి నుంచి.. రష్యా నుంచి శాంతి సంకేతాలు రాలేదని, రష్యా ఇటీవల తమ పౌరులపై దాడులు  ఉధృతం చేస్తోందని, అసలు పుతిన్‌ శాంతి చర్చలకు సిద్ధంగా లేడని జెలెన్‌స్కీ అంటున్నారు. ఈ యుద్ధం ముగియాలంటే వెంటనే కాల్పుల విరమణ అమలు కావాలని అని జెలెన్‌స్కీ మోదీతో చెప్పినట్లు తెలుస్తోంది. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)