Breaking News

మీ బోర్డర్‌ దాటి వస్తున్న పాక్‌ టెర్రరిస్టుల సంగతేంటి?

Published on Sun, 08/31/2025 - 20:40

న్యూఢిల్లీ:  షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక అంశాలను చర్చించారు.  ఇందులో చైనా సరిహద్దుల నుంచి భారత్‌లోకి చొరబడుతున్న పాక్‌ టెర్రరిస్టుల అంశాన్ని కూడా ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌ వద్ద ప్రస్తావించారు. అయితే దీనికి చైనా తన సంపూర్ణ మద్దతును భారత్‌కు ఇస్తున్నట్లు స్పష్టం​ చేసింది. 

ఈ విషయాన్ని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. ‘ జిన్‌పింగ్‌ వద్ద పాక్‌ ఉగ్రవాద కార్యకలాపాలను కూడా మోదీ ప్రస్తావించారు. ఇందుకు చైనా సానుకూలంగా స్పందించింది. టెర్రర్‌ కార్యకలాపాల వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని జిన్‌పింగ్‌ అన్నారు. ఎటువంటి ఉగ్రవాద చర్యల నిర్మూలనకైనా తమ మద్దతు ఉంటుందని జిన్‌పింగ్‌ అన్నారు. ఇరుదేశాలకు ప్రమాదంగా మారిన ఉగ్రవాద అంశాన్ని జిన్‌పింగ్‌ కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు.  ఉగ్రవాద నిర్మూలనకు భారత్‌కు తమ వంతు సహకారం అందిస్తామన్నారు’ అని విక్రమ్‌ మిస్రీ పేర్కొన్నారు. 

టియాంజిన్ నగరంలో ఎస్‌సీవో  సదస్సులో పాల్గొన్న మోదీ..  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్,  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయ శాంతి, ఆర్థిక స్థిరత్వం,  సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపు,  సాంకేతిక రంగాల్లో సహకారం పెంచుకునే వంటి అంశాలపై చర్చలు జరిగాయి.వాణిజ్య, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 

భారత్-చైనా మధ్య స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతాయి అని ప్రధాని మోదీ తెలపడంతో  ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడానికి అడుగులు పడ్డాయి. ఈ పర్యటన ద్వారా భారత్ తన ప్రాంతీయ ప్రాబల్యాన్ని చాటింది. ఇది భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది.

Videos

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)