Breaking News

చైనాలో అడుగుపెట్టిన మోదీ

Published on Sat, 08/30/2025 - 17:20

తియాంజిన్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. జపాన్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకొని శనివారం సాయంత్రం చైనాకు చేరుకున్నారు. ఉత్తర చైనాలోని తియాంజిన్‌లో ఆదివారం, సోమవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తోపాటు ఇతర దేశాల అధినేతలతో సమావేశమవుతారు. తియాంజిన్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు సంప్రదాయ రీతిలో సంగీత, నృత్య కార్యక్రమాలతో స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌తోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది.    
 

ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత్, చైనా కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతుండడం, మోదీ–జిన్‌పింగ్‌ భేటీ అవుతుండడాన్ని ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అలాగే చైనా అధినేత జిన్‌పింగ్‌ 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. 

టియాంజిన్ లో  ల్యాండ్ అయిన ప్రధాని మోదీ

గణనాథుడి చిత్రాన్ని షేర్‌ చేసిన చైనా   ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్‌.. వినాయకుడి ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇరుదేశాలు కళలు, విశ్వాసం, సంస్కృతులను పంచుకున్నాయని వెల్లడించారు. ఇవి చైనాలోని టాంగ్‌ రాజవంశం కాలంలో, మొగావో గుహల్లోని గణనాథుడి ప్రతిమలు అని పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య శతాబ్దాలుగా బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఇవి అద్భుతమైన ప్రతీకలు అని యూ జింగ్‌ స్పష్టంచేశారు.   

 

 

 

 

 

 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)