చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
పనామాను వణికించిన భూకంపం.. తొలగిన సునామీ భయం!
Published on Sat, 10/10/2026 - 07:13
మధ్య అమెరికా దేశం పనామాను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి, ఎత్తైన భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా.. రహదారులు దెబ్బతిన్నాయి. తొలుత పనామాతో పాటు పలు దేశాల తీర ప్రాంతాలకు జారీ చేసిన సునామీ హెచ్చరికలను అధికారులు ఆ తర్వాత ఉపసంహరించారు. దీంతో తీర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు కొనసాగిస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి పనామాను భారీ భూకంపం వణికించింది. హెర్రెరా ప్రావిన్స్‌లోని పిటలోజా అర్రిబా ప్రాంతానికి సమీపంలో ఉన్నట్లు అమెరికా భూగర్భ సర్వే సంస్థ (యూఎస్‌జీఎస్) వెల్లడించింది. పనామా రాజధాని పనామా సిటీకి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దాదాపు నిమిషం పాటు ప్రకంపనలు కొనసాగడంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
కోక్లే ప్రావిన్స్‌లోని పెనోనోమే ప్రాంతంలో చారిత్రక చర్చి, గవర్నర్ కార్యాలయ భవనం సహా పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హెర్రెరా, లాస్ శాంటోస్ ప్రాంతాల్లోనూ ఇళ్లు, ఇతర నిర్మాణాలకు నష్టం వాటిల్లినట్లు వార్తలు వెలువడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, ఫోన్‌కాల్స్-ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది.
A massive magnitude 7.7 earthquake struck Panama, shaking buildings more than 100 miles away and prompting evacuations, according to the U.S. Geological Survey. Tremors were felt in Panama City, where buildings shook and people evacuated into the streets. https://t.co/46kFq5wpSV https://t.co/jsr5g6uLDv
— CBS News (@CBSNews) October 9, 2026
80కి పైగా ప్రకంపనలు
ప్రధాన భూకంపం తర్వాత వరుసగా ప్రకంపనలు(ఆఫ్టర్ షాక్స్) రావడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. వాటిల్లో ఒకటి 6.6 తీవ్రతతో సంభవించింది. పనామా సిటీలో ఎత్తైన భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. టోకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను కొద్దిసేపు నిలిపివేసి, తనిఖీల అనంతరం తిరిగి ప్రారంభించారు. పనామా కాలువలో మాత్రం కార్యకలాపాలకు అంతరాయం కలగలేదని సమాచారం. భూకంపం కారణంగా ప్రాణనష్టం జరిగినట్లు తొలుత అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే పలువురికి స్వల్ప గాయాలైనట్లు, దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. భవనాల నష్టం, రహదారుల పరిస్థితి, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులు అంచనా వేస్తున్నారు.
భయంతో..
భూకంప కేంద్రానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని పనామా సిటీలోనూ ప్రకంపనల తీవ్రత కనిపించింది. ఎత్తైన భవనాల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. 15 అంతస్తుల భవనం నుంచి రెండోసారి బయటకు వచ్చిన సాలమన్ ఆండియన్ అనే వ్యక్తి.. ఫర్నిచర్, మంచం, వంటగదిలోని వస్తువులు బలంగా కదిలాయని వెల్లడించారు.
TERREMOTO EN PANAMÁ ▪️Panamá afectado por este terrible terremoto de 7.6. Se sintió en Ciudad de Panamá, hay Alerta de tsunami; se produjeron varias réplicas. #Terremoto #Panamá #Sismo https://t.co/udnuMfvWiQ
— @ALTOS_NOTICIASpy (@Altosnoticiasp1) October 9, 2026
20 అంతస్తులకు పైగా ఉన్న ఓ భవనం పైకప్పుపై ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ నుంచి నీరు కిందకు జారిపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పనామా కాలువపై ఉన్న ఓ వంతెన సైతం తీవ్రంగా కంపించినా కూలిపోలేదు. ఆ సమయంలో వాహనాలు వంతెనపై ప్రయాణిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగించాయి.
సునామీ వార్నింగ్ ఎత్తివేత
భూకంపం తర్వాత పనామాతో పాటు కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్, పెరూ, నికరాగువా, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్, మెక్సికో తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అనంతరం సునామీ ముప్పు తొలగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ తీర ప్రాంత ప్రజలు స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, భూకంపానంతర ప్రకంపనల(After Shocks) పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధ్యక్షుడి ప్రకటన.. విద్యాసంస్థలు బంద్
భూకంప తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భూకంపం తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన పెనోనోమే ప్రాంతాన్ని సందర్శించారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో తరగతులను నిలిపివేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్ పనామా సహా విద్యాసంస్థల్లోనూ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, అగ్నిమాపక కేంద్రాల్లోనూ నష్టం నమోదైంది. 17 ఆరోగ్య సంస్థల్లో భవనాలకు సంబంధించిన సమస్యలు గుర్తించగా, కొన్ని ఆసుపత్రుల్లో రోగులను ముందుజాగ్రత్తగా బయటకు తరలించారు. పలు పాఠశాలలు, అగ్నిమాపక కేంద్రాల్లోనూ గోడలకు పగుళ్లు, పైకప్పుల పెచ్చులు ఊడిపోవడం వంటి నష్టం కనిపించింది. అధ్యక్షుడు, అధికారులు నష్టంపై సమీక్ష కొనసాగిస్తుండగా.. పొరుగుదేశాలు, అమెరికా సైతం సహాయానికి ముందుకొచ్చాయి.
గతంలోనూ లాటిన్ అమెరికాలో భారీ విధ్వంసం
లాటిన్ అమెరికా ప్రాంతం భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. భూమి లోపల ఉన్న టెక్టానిక్ పలకల కదలికల కారణంగా ఇక్కడ తరచూ తీవ్ర ప్రకంపనలు సంభవిస్తుంటాయి. 2010లో హైతీలో సంభవించిన 7.0 తీవ్రత భూకంపం భయానక విధ్వంసాన్ని సృష్టించింది. అధికారిక అంచనాల ప్రకారం సుమారు 3.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, మరో 3 లక్షల మంది గాయపడ్డారు. అదే ఏడాది చిలీలో 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం, దాని తర్వాత సంభవించిన సునామీ కారణంగా 521 మంది మరణించగా, మరో 56 మంది ఆచూకీ లభించలేదు. సుమారు 3.7 లక్షల ఇళ్లు దెబ్బతినడమో లేదంటే పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతకుముందు 1960లో చిలీలో సంభవించిన 9.5 తీవ్రత భూకంపం ఆధునిక చరిత్రలో నమోదైన అత్యంత శక్తిమంతమైన భూకంపంగా గుర్తింపు పొందింది. ఆ భూకంపం, దాని తర్వాత వచ్చిన సునామీ కారణంగా చిలీలోనే సుమారు 1,600 మంది ప్రాణాలు కోల్పోగా, హవాయి, జపాన్, ఫిలిప్పీన్స్ తదితర ప్రాంతాల్లో మరో 200 మంది మరణించారు.

ఇదీ చదవండి: ఏకంగా ఐసీసీపైనే అమెరికా ఆంక్షలు
Tags : 1