Breaking News

బంగ్లాకు పాక్ యుద్ధనౌక.. ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌?

Published on Sun, 11/09/2025 - 11:30

ఢాకా: దాయాది పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. పాకిస్తాన్‌కు చెందిన కీలక నేతలు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

తాజాగా పాకిస్తాన్‌కు చెందిన నేవీ యుద్ధనౌక చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుంది. పాక్‌ నేవీకి చెందిన యుద్ధనౌక, PNF SAIF.. నాలుగు రోజుల సౌహార్ద పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుంది. ఈ విషయాన్ని బంగ్లా నేవీ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది. బంగ్లాదేశ్ నేవీ పాక్‌ యుద్ధనౌకకు హృదయపూర్వక స్వాగతం పలికింది. అయితే, 1971 తర్వాత పాక్ యుద్ధనౌక బంగ్లాదేశ్‌ సందర్శించడం ఇదే తొలిసారి. ఇది పాక్ కొత్త ఎత్తుగడగా భారత్ భావిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌తో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత పాక్.. బంగ్లాదేశ్ ద్వారా మన దేశాన్ని చుట్టుముట్టాలని కుట్ర పన్నుతోందని సమాచారం.

ఇదిలా ఉండగా.. కెప్టెన్ షుజాత్ అబ్బాస్ రాజా నేతృత్వంలోని జుల్ఫికార్-క్లాస్ ఫ్రిగేట్ పిఎన్ఎస్ సైఫ్ (FFG-253) సద్భావన పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టుకు యుద్ధనౌక చేరుకుంది . పాకిస్తాన్ నేవీ చీఫ్ అడ్మిరల్ నవీన్ అష్రఫ్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి అధికారిక పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌లో ఉన్న సమయంలో ఈ సందర్శన జరిగింది. మరోవైపు.. గత అక్టోబర్‌ ప్రారంభంలో పాక్‌ సైన్యంలో రెండో అత్యున్నత సైనిక కమాండర్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా కూడా బంగ్లాదేశ్‌ను సందర్శించారు. మీర్జా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్‌తో సమావేశమయ్యారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)