Breaking News

ప్రియుని కోసం పాకిస్తాన్‌ వచ్చిన బ్రిటన్‌ మహిళ.. పోలీసులకు చుక్కలు!

Published on Mon, 07/31/2023 - 07:43

ఇటీవలి కాలంలో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పలువురు యువతీయువకుల ప్రేమ కథలు వినిపిస్తున్నాయి. మొదట సీమా హైదర్‌, ఇప్పుడు అంజూ.. వీరిద్దరూ ప్రేమ పేరుతో ‘సరిహద్దులు’ దాటేశారు. ఈ తరహా కథలు ఈమధ్య కాలంలో సోషల్‌మీడియాలో లెక్కకుమించి కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి కథలన్నీ నిజం కాదనే వాదన కూడా వినిపిస్తోంది.

తాజాగా పాక్‌ పోలీసులు ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వాకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. సోషల్‌ మీడియాలో ఫేక్‌ పోస్ట్‌ పెట్టాడనే ఆరోపణలతో అతనిపై కేసు నమోదు చేశారు. ఆ పోస్టులో ఒక మహిళ తన ప్రేమికునితో పాటు ఉండేందుకు విదేశాల నుంచి ఇక్కడకు వచ్చిందని పేర్కొన్నాడు. అయితే అతని కథనంలో నిజం లేదని పోలీసులు తేల్చారు. 

సీరియస్‌గా మారిన సిల్లీ పోస్ట్‌!
పాక్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘ఆజ్‌ ఇంగ్లీష్‌’లోని ఒక  కథనం ప్రకారం ముహమ్మద్‌ గులాబ్‌ ఒక సోషల్‌ మీడియా పోస్టులో ఇలా అనే ఒక ‍బ్రిటీష్‌ మహిళ తన ప్రియునితో పాటు ఉండేందుకు సలార్‌జై వచ్చిందని పేర్కొన్నాడు. కేవలం వినోదం కోసం అతను షేర్‌ చేసిన ఈ పోస్టు సీరియస్‌గా మారిపోయింది. ఈ పోస్టును చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై, ఆ వ్యక్తి ఆ పోస్టులో పేర్కొన్న చిరునామాకు తరలివెళ్లి చూడగా, అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. 

కేసు నమోదు.. అరెస్టు!
అనంతరం పోలీసులు ఈ ఫేక్‌ పోస్టు క్రియేట్‌ చేసిన ముహమ్మద్‌ గులాబ్‌పై కేసు నమోదు చేయడంతో పాటు అతనిని అరెస్టు చేశారు. అయితే స్థానికులు ముహమ్మద్‌ అరెస్టును వ్యతిరేకించారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి పోస్టులు సాధారణమేనని వారు వాదిస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం పాకిస్తానీ మహిళ సీమా హైదర్‌ తన భారతీయ ప్రేమికుని కోసం నేపాల్‌ మార్గం గుండా అక్రమంగా భారత్‌లోనికి ప్రవేశించింది. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఇదేవిధంగా భారత్‌కు చెందిన అంజూ తన ఫేస్‌బుక్‌ ప్రెండ్‌ నసరుల్లాను కలుసుకునేందుకు పాక్‌ వెళ్లింది. ఇది కూడా సంచలనంగా మారింది. 
ఇది కూడా చదవండి: రోడ్డుపై అర్థనగ్నంగా యువతి నృత్యం.. ఒళ్లు మండిన యువకుడు చేసిన పని ఇదే..

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణాష్టమి సందడి.. సినీ ప్రముఖుల పిల్లలు ఇలా (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)