Breaking News

భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ

Published on Wed, 05/14/2025 - 17:42

ఇస్లామాబాద్‌: భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధూ జలాల ఒప్పందంపై (indus waters treaty) సమీక్షించుకోవాలని ప్రాధేయపడింది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్‌ సిందూర్‌పై (operation sindoor) జాతినుద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవు.  నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు’ అంటూ ఉగ్రవాదంపై భారత్‌ వైఖరి గురించి పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్‌పై భారత్‌ విధించిన ఆంక్షలు కొనసాగుతాయని సూచించారు.

👉పాక్‌పై భారత్‌ సింధూ అస్త్రం.. ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?

ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్రదాడి (2025 Pahalgam attack) తర్వాత పాకిస్తాన్‌పై భారత్‌ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనిలో భాగంగా సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ దేశంతో వాణిజ్యం రాకపోకలను నిషేధించింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మీడియా సమావేశంలో ఈ వివరాల్ని వెల్లడించారు.  

అయితే, సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపి వేయడంతో దాయాది దేశంలో నీటి కటకట మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్‌ పంటపై ప్రభావం పడింది. 

భారత్ కు పాకిస్థాన్ లేఖ

ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్తాన్‌.. భారత్‌కు లేఖ రాసింది. ఆ లేఖలో సింధూ జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయం విషయంలో పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాకిస్తాన్‌ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా.. భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఓ అధికారిక లేఖ రాసారు. సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించేలా భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని లేఖలో కోరారు. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)