Breaking News

భారత్‌ డర్టీ గేమ్స్‌ ఆడుతోంది.. పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 10/17/2025 - 09:03

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి భారత్‌ను టార్గెట్‌ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భారత్‌ డర్టీ గేమ్స్‌ ఆడుతోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్‌ (India) తరఫున ఆప్ఘనిస్తాన్‌ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ నిందలు మోపే ప్రయత్నం చేశారు. భారత్‌, ఆప్ఘన్‌తో రెండు వైపులా యుద్దానికి పాకిస్తాన్‌ సిద్ధంగా ఉందన్నారు.

పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ‘పాకిస్తాన్‌ విషయంలో ఆప్ఘన్‌, భారత్‌ అనుచితంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. భారత్‌ సరిహద్దులో డర్టీ గేమ్‌ ఆడుతోంది. ఇస్లామాబాద్ యుద్ధ పరిస్థితులపై ప్రతిస్పందించడానికి వ్యూహాలను రూపొందించింది. యుద్ధానికి సంబంధించి బలమైన అవకాశాలు ఉన్నాయి. యుద్ధ వ్యూహాల గురించి బహిరంగంగా చర్చించలేను. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.

అంతకుముందు కూడా ఆసిఫ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆప్ఘనిస్తాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ ఇటీవల భారత్‌లో పర్యటించడంపై అక్కసు వెళ్లగక్కారు. ముత్తాఖీ ఆరు రోజుల పర్యటనలో పలు ప్రణాళికలు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందన్నారు. ఇక, ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయొద్దంటూ హెచ్చరికలు చేశారు. తాలిబాన్ నిర్ణయాలను ఢిల్లీ స్పాన్సర్ చేస్తోంది. ఢిల్లీ కోసం కాబూల్‌ ప్రాక్సీ యుద్ధం చేస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ‘ఆప్ఘన్‌లో భారీ దాడులు జరిగాయి. స్నేహపూర్వక దేశాల జోక్యం తర్వాత కాల్పుల విరమణకు వారు అంగీకరించారు. కానీ, అది పేలవంగా ఉంది. ఇది ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవడం లేదు’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీకి ట్రంప్‌ ఫోన్‌ కాల్‌.. అంతా ఉత్తిదే’

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)