Breaking News

కార్గో విమానం అదృశ్యం : సముద్రంలో కూలిపోయిందనే ఆందోళన

Published on Wed, 07/08/2026 - 10:56

షార్జా నుండి కరాచీ వెళ్తున్న కె2 ఎయిర్‌వేస్ (K2 Airways) కు చెందిన బోయింగ్ 737 కార్గో విమానం (KTA1732)  అదృశ్యమైంది. అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా కరాచీ సమీపంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. నావిగేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని ఫ్లైట్‌రాడార్24 భావిస్తోంది. అయితే పాకిస్తాన్ అధికారులు దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (PAA) తీర ప్రాంతంలో గాలింపు , రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం  చేసింది.

ఏమి జరిగింది?
పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9:18 గంటలకు విమానంలోని నావిగేషన్ సిస్టమ్‌లో సమస్య ఉన్నట్లు పైలట్ నివేదించారు. ఆ తర్వాత రాత్రి 9:21 గంటల సమయంలో విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోతూ, వేగంగా దిశ మార్చుకున్నట్లు రాడార్‌లో కనిపించింది.  కరాచీకి పశ్చిమంగా 155 నాటికల్ మైళ్ల దూరంలో విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.భయంకరమైన వేగంతో కిందకు  పడిపోయింది.

ఇదీ చదవండి: కేతన్‌ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్‌ మ్యారేజ్

ఫ్లైట్‌రాడార్24 (Flightradar24) డేటా ప్రకారం, విమానం నుండి చివరి సిగ్నల్ వచ్చేసరికి అది సముద్ర మట్టానికి కేవలం 1,100 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాదు, అది నిమిషానికి 22,400 అడుగుల అత్యంత వేగంతో కిందకు దూసుకుయింది. అదృశ్యమైన ఈ బోయింగ్ 737-400 విమానం 1999 నాటిది. మొదట ప్రయాణీకుల విమానంగా పనిచేసి, 2012లో కార్గో విమానంగా మారింది. 2024లోనే ఇది కె2 ఎయిర్‌వేస్ సంస్థలో చేరింది.

ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్‌

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)