Breaking News

మహిళలకు ఎర వేస్తున్న జైషే ఉగ్రవాద సంస్థ!

Published on Wed, 10/22/2025 - 15:56

ఉగ్రవాద సంస్థ  జైష్-ఏ-మహ్మద్‌ సంస్థ తన పంథాను మార్చుకుని మహిళలను కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లోకి దించేందుకు సిద్ధమైంది. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్‌ (Jaish-e-Mohammed) కేవలం మహిళలతో జీహాదీ గ్రూప్‌ను తయారు చేస్తున్నది. దీంతో పాటు వసూళ్లను  కూడా ముమ్మరం చేస్తోంది. మసూద్‌ అజార్‌ (Masood Azhar) సోదరి సాదియా అజార్‌ (Sadiya Azhar) నేతృత్వంలో ‘జమాతుల్‌-ముమినాత్‌’ పేరుతో మహిళా దళాన్ని తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు  తుఫత్ అల్-ముమినాత్ అనే ఆన్‌లైన్ శిక్షణా కోర్సును ప్రారంభించినట్లు  తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను ఎన్‌డీటీవీ నివేదించింది.

జైష్ అధినేత మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలోని 'జమాత్ ఉల్‌ మోమినాత్' అనే మహిళా బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కోర్సులో భాగంగా, జైష్ నాయకుల కుటుంబ సభ్యులు, వ్యవస్థాపకుడు మసూద్ అజార్, అతని కమాండర్ల బంధువులు, జిహాద్, ఇస్లాంకు సంబంధించి వారి 'విధుల' గురించి బోధిస్తారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే నియామక డ్రైవ్ వచ్చే నెల నవంబర్ 8 నుండి ప్రారంభం కానుంది. ఈ 'ఉపన్యాసాలు' రోజుకు 40 నిమిషాలు ఉంటాయి.  అజార్ ఇద్దరు సోదరీమణులు, సాదియా అజార్, సమైరా అజార్ నాయకత్వం వహిస్తారు. ఇందులో జమాత్ ఉల్-ముమినాత్‌లో చేరేలా మహిళల్ని పోత్సహిస్తాయి. గత నెలలో బహవల్పూర్‌లోని మర్కజ్ ఉస్మాన్ ఓ అలీలో తన చివరి బహిరంగ ప్రసంగం తర్వాత, ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ 'కోర్సు'లో చేరే ప్రతి మహిళ నుండి  రూ. 156  వసూలు చేసి, వారిని ఆన్‌లైన్ సమాచార ఫారం నింపమని బలవంతం చేస్తోందట. దీంతోపాటు అజార్ తన 'విరాళాల' కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది.

చదవండి: ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న దీపికా తనయ ‘దువా’ ఫోటోలు : అలియా రియాక్షన్‌

కాగా  ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా  ఐక్యరాజ్యసమితి  ఎపుడో గుర్తించిన జైష్-ఎ-మొహమ్మద్, జమాత్ ఉల్-ముమినాత్ అనే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. అజార్ అక్టోబర్ 8న జమాత్ మహిళా విభాగాన్ని ప్రకటించాడు. అలాగే అక్టోబర్ 19న, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో, మహిళలను సమూహంలోకి తీసుకొచ్చేలా 'దుఖ్తరన్-ఎ-ఇస్లాం' అనే కార్యక్రమం కూడా జరిగింది.

ఇదీ చదవండి: ఇండోర్‌ మహారాణి : నీతా అంబానీ లాంగ్‌ నెక్లెస్‌ ఆ డైమండ్స్‌ ఎలా మోసారండీ!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)