Breaking News

పాక్‌ కల్నల్‌ ఇమ్రాన్‌ దారుణ హత్య.. భారత్‌ హస్తం?

Published on Sun, 02/01/2026 - 10:38

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌లో సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్‌లో భారత్‌ వ్యతిరేకులను టార్గెట్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. వారిని వెంటాడి మరీ చంపుతున్నారు. తాజాగా పహల్గాం ఉగ్రవాద దాడి ప్లాన్‌కు కారణమని భావిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నర్ ఇమ్రాన్ దయాల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చడం పాకిస్తాన్‌ను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఇమ్రాన్ దయాల్‌ ఐఎస్‌ఐ చీఫ్ హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు కావడం విశేషం.

వివరాల మేరకు.. పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్‌ ఇమ్రాన్ దయాల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్‌ చేశారు. బుధవారం(జనవరి 28వ తేదీన) డేరా ఇస్మాయిల్ ఖాన్‌ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని షోర్ కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ దయాల్‌ చనిపోయాడు. అయితే, పాక్ అధికారులు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఇమ్రాన్ లక్ష్యంగా జరగలేదని, వ్యక్తిగత శత్రుత్వం, ప్రణాళికబద్ధమైన దాడితో సంబంధం లేదని అధికారులు తెలిపారు. రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించినట్లు అక్కడి మీడియా చెప్పుకుంటోంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో దయాల్ చిక్కుకున్నాడని చెబుతోంది.

కానీ, దాడి కారణంగా ఇమ్రాన్‌ వాహనం పూర్తిగా దెబ్బతిన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే, ఈ దాడులు ఎవరు చేశారనే వివరాలు ఐఎస్ఐ, పాక్ పోలీసులు, పాక్ సైన్యానికి అంతు చిక్కడం లేదు. భారత్ మోస్ట్ వాంటెట్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఇమ్రాన్ దయాల్ అత్యంత సన్నిహితుడు. ఇక, ఇమ్రాన్ దయాల్.. భారత్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ముఖ్య కారకుడు అని తెలుస్తోంది. ఇమ్రాన్‌ హత్యతో రంగంలోకి దిగిన అధికారులు.. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా దాడులతో పాక్‌ ప్రభుత్వం, పాక్‌ సైన్యంలో ఆందోళన మొదలైనట్టు సమాచారం. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు, ఇలా పాక్తిస్తాన్‌కు చెందిన కీలక నేతలను హతమారుస్తున్న నేపథ్యంలో వారంతా భారత్‌ దురంధర్‌లు అంటూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. భారత్‌కు చెందిన సీక్రెట్‌ ఏజెంట్లే వారిని హతమారుస్తున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 
 

ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రత్యేక ప్రాంతం బలూచిస్తాన్‌లో ఆ ప్రాంతానికి చెందిన తిరుగుబాటు సంస్థ బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) పాక్ భద్రతా సిబ్బందిపై దాడులకు దిగింది. దీంతో పాక్ పోలీసులు కూడా ఎదురుదాడులకు దిగారు. ఈ కాల్పుల్లో 10 మంది పాక్ పోలీసులు మరణించగా, 80 మంది బీఎల్ఏ ఉద్యమకారులు మరణించినట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్ ప్రాంతంలోని ఐదు జిల్లాలకు చెందిన 12 ప్రదేశాల్లో, ఏకకాలంలో ‘ఆపరేషన్ హీరోఫ్’ పేరుతో బీఎల్‌ఏ దాడులకు దిగింది. పాకిస్తాన్ ఆర్మీ, భద్రతా సిబ్బందిపై గన్స్‌, ఇతర ఆయుధాలతో దాడి చేయడంతోపాటు ఆత్మాహుతి దాడులకు దిగింది. క్వెట్టా, మాస్తంగ్, నుష్కి, పస్ని, గ్వాదర్ జిల్లాల్లో బీఎల్ఏ దాడులు చేసింది. దీంతో పాక్ సిబ్బంది కూడా ఎదురు కాల్పులకు దిగి, బీఎల్ఏ దాడుల్ని తిప్పికొట్టారు. అయితే, బలూచ్‌ నేతలే ఇమ్రాన్‌ను హత్య చేశారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా,  పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో కొన్నేళ్లుగా తిరుగుబాటు ఉద్యమం నడుస్తోంది. పాకిస్తాన్‌ నుంచి వేరుపడాలని కోరుతూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దళాలలకు, బీఎల్ఏకు మధ్య నిరంతరం ఘర్షణ కొనసాగుతూనే ఉంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)