Breaking News

పారిపోండ్రోయ్‌..!! 

Published on Sun, 05/25/2025 - 02:36

ఇస్లామాబాద్‌: శత్రువు ఎదురొస్తే అతని ప్రాణం తీయడమో లేదంటే తన ప్రాణాలు పోయేదాకా పోరాడటమే వీరుని లక్షణం. పాకిస్తాన్‌ సైన్యాధికారికి ఇవేం లేనట్లు తాజాగా ఉదంతంతో స్పష్టమైంది. ఆపరేషన్‌ సిందూర్‌ వేళ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్‌ సైనిక స్థావరంపై భారత్‌ దాడులు చేస్తుంటే దీటుగా స్పందించాల్సింది పోయి పారిపోయిన పాక్‌ బ్రిగేడ్‌ కమాండర్‌ పలాయనపర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది.

 భారత క్షిపణులు పాక్‌ సైనికుల వెన్నులో వణుకు పుట్టించిందన్న వార్త వాస్తవమని తాజా ఘటనతో నిరూపితమైంది. నాయకుడై ముందుండి నడిపించాల్సిందిపోయి తన కింద పనిచేసే జవాన్లకు పిరికిమందు నూరిపోసిన బ్రిగేడ్‌ కమాండర్‌ వివరాలు అక్కడి ఒక జూనియర్‌ ఆఫీసర్‌ చేసిన ‘రేడియో సిగ్నళ్ల’డీకోడ్‌ ద్వారా వెల్లడయ్యాయి.  

అంతా సర్దుకున్నాక తాపీగా వస్తా 
జూనియర్‌ అధికారి ఇతర అధికారులకు ‘రేడియో సిగ్నళ్ల ద్వారా పంపిన సందేశాలను భారత సైన్యం విజయవంతంగా డీకోడ్‌ చేయగా అందులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాక్‌ ఆక్రమిత కశీ్మర్‌లోని ముజఫరాబాద్‌ వద్ద పాక్‌ ఆర్మీలోని 75వ ఇన్‌ఫ్యాంట్రీ బ్రిగేడ్‌ స్థావరం ఉంది. దానికి ఒక కమాండర్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాక్‌పై భారత్‌ సైనిక చర్య మొదలెట్టింది. 

ఈ 75వ బ్రిగేడ్‌ స్థావరం మీదా భారత్‌ దాడులు జరిపింది. వెంటనే భయంతో వణికిపోయిన కమాండర్‌ అక్కడి నుంచి ఉడాయించాడు. పత్తాలేకుండా పోయిన కమాండర్‌ గురించి అక్కడి జూనియర్‌ అధికారి ఆరాతీశాడు. కమాండర్‌ యుద్ధక్షేత్రంలో మాయమై మసీదులో తేలాడు. అక్కడ నమాజ్‌ చేసుకుంటూ తలదాచుకుంటున్నట్లు తెల్సింది. 

వెంటనే ఆర్మీబేస్‌కు రావాలని జూనియర్‌ అధికారి కోరగా.. ‘‘నేనిప్పుడు రాను. భారత దాడి ఆగిపోయాక, పరిస్థితి అంతా సద్దుమణిగాక వస్తా. మీరు కూడా అక్కడ ఉండకండి. ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోండి. ఉద్రిక్తతలు తగ్గాక ఆర్మీ బేస్‌ కార్యాలయాన్ని తాపీగా తెరుద్దాం’’అని కరాఖండిగా చెప్పేశాడు. ఇది విన్న జూనియర్‌ ఆఫీసర్‌ హుతాశుడై సంబంధిత సమాచారాన్ని ఇతర అధికారులకు చేరవేశాడు. ఇతర అధికారులతో చెబుతున్న రేడియో చాటింగ్‌ వివరాలను భారత సైన్యం డీకోడ్‌ చేసింది. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)