Breaking News

కశ్మీర్‌ను మరిచిపోయే ప్రసక్తే లేదు: పాక్‌ ఆర్మీ చీఫ్‌

Published on Thu, 04/17/2025 - 12:23

కశ్మీర్‌ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌(General Asim Munir) భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్‌, పాకిస్థాన్‌లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన.. కశ్మీర్‌ను ఇస్లామాబాద్‌కు గళ సిరగా అభివర్ణించారు. ఈ క్రమంలో పాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను మరిచిపోదని, ఏ శక్తీ దానిని పాక్‌ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. అలాగే దేశ విభజనకు కారణమైన రెండు దేశాల విభజనను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలూ చేశారు. 

పాక్‌ మీడియా హౌజ్‌ డాన్‌(dawn) కథనం ప్రకారం..  తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన జనరల్‌ మునీర్‌ మాట్లాడారు. ఉగ్రకార్యకలాపాలతో పాక్‌ నిధులు రావనే భయాలు నెలకొన్నాయని.. కానీ, ఆ భయాలను తొలగించే ప్రయత్నాల్లో పాక్‌ సైన్యం ఉందని అన్నారు. ఉదాహరణగా.. బెలూచిస్తాన్‌, కశ్మీర్‌ అంశాలను(Kashmir Issue) ప్రస్తావించారు. 

పాక్‌కు బెలూచిస్తాన్‌ ఎంతో గర్వకారణమైంది. అలాంటి ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలను పాక్‌ సైన్యం సమర్థవంతంగా అణచివేసింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పెట్టుబడులు రాకపోవచ్చనే భయాలు ఉన్నాయి. కానీ, ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలరా?. త్వరలో పూర్తి విజయం సాధిస్తాం. ఇంకో పది జన్మలెత్తినా ఆ ప్రాంతాన్ని మనకు ఎవరూ దూరం చేయలేరు. ఇక.. కశ్మీర్‌పై తమ ఆశ చావదన్న పాక్‌ ఆర్మీ చీఫ్‌(Pak Army Chief)..  అది మాకు గళ సిర(జగ్యులర్‌ సిర) అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మరిచిపోలేమని, కశ్మీరీ సోదరుల వీరోచిత పోరాటాలను అంత సులువుగా వదిలిపెట్టబోమని, ఏ శక్తీ దానిని పాక్‌ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు.  

పాక్‌ గురించి తర్వాతి తరాలకు ఎంతో చెప్పాల్సిన అవసరం ఉందన్న జనరల్‌ మునీర్‌.. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ హిందువులతో మనం(ముస్లిం) వేరనే విషయం తెలియజేయాల్సిన బాధ్యత ఉందంటూ పాక్‌ పౌరులకు సూచించారు. ఇదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది అని అన్నారాయన. ఏరకంగా ఈ రెండు దేశాలు ఒక్కటి కాదని.. అందుకే తమ పూర్వీకులు పాక్‌ కోసం పోరాడారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే దానిపైనే దృష్టిసారించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు భారత్‌ ఎలా ‍స్పందిస్తుందో చూడాలి మరి!.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)