Breaking News

అఫ్గాన్‌తో ఉద్దేశపూర్వకంగా మునీర్‌ వైరం

Published on Thu, 12/04/2025 - 05:50

లాహోర్‌: పాకిస్తాన్‌ ఫీల్డ్‌ మార్షల్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ అనుసరిస్తున్న విధానాలు దేశానికి వినాశకరమైనవని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ బుధవారం ఆరోపించారు.  ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలను పెంచుతున్నారని ప్రస్తుతం పాకిస్తాన్‌ జైలులో ఉన్న ఇమ్రాన్‌ ధ్వజమెత్తారు.

 షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో, దాదాపు నెల రోజుల విరామం తర్వాత రావల్పిండిలోని అడియాలా జైలులో తన సోదరి డాక్టర్‌ ఉజ్మా ఖాన్‌ను కలిసిన మర్నాడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆసిమ్‌ మునీర్‌ విధానాలు పాకిస్తాన్‌కు విపత్కరమైనవి. ఆయన విధానాలతో, ఉగ్రవాదం అదుపు తప్పి పెరిగిపోతోంది. ఇది నన్ను తీవ్రంగా బాధించింది’.. అని ఖాన్‌ ఉర్దూలో ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

పశ్చిమ దేశాలను సంతృప్తిపరచడానికే..
‘ఆసిమ్‌ మునీర్‌కు పాకిస్తాన్‌ జాతీయ ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టదు. పశ్చిమ దేశాలను సంతోషపెట్టడానికి మాత్రమే ఆయన ఇదంతా చేస్తున్నారు. అంతర్జాతీయంగా తానొక ’ముజాహిద్‌’ (ఇస్లామిక్‌ ఫైటర్‌) గా కనిపించడానికి, ఉద్దేశపూర్వకంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్రిక్తతలను రాజేశారు’.. అని ఖాన్‌ ఆరోపించారు. డ్రోన్‌ దాడులను, సొంత ప్రజలపై సైనిక చర్యలను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. 

అవి ఉగ్రవాదాన్ని మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ‘మునీర్‌ మొదట ఆఫ్ఘన్‌లను బెదిరించారు, తరువాత శరణార్థులను పాకిస్తాన్‌ నుండి బహిష్కరించారు. డ్రోన్‌ దాడులు చేశారు. వాటి పర్యవసానాలను ఇప్పుడు మనం పెరుగుతున్న ఉగ్రవాదం రూపంలో ఎదుర్కొంటున్నాం’.. అని ఖాన్‌ పేర్కొన్నారు. జనరల్‌ మునీర్‌ను.. మానసిక స్థిరత్వం లేని వ్యక్తిగా అభివర్ణించారు. 

మునీర్‌ ఆదేశాలతోనే నిర్బంధం
మునీర్‌ ఆదేశాల మేరకే, తనను, తన భార్యను తప్పుడు కేసులతో బంధించి, అత్యంత దారుణమైన మానసిక చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఖాన్‌ వాపోయారు. ‘నన్ను నాలుగు వారాలుగా ఒంటరి నిర్బంధంలో ఉంచారు. సెల్‌లో ఉంచి తాళం వేశారు. బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు లేవు. జైలు మాన్యువల్‌ హామీ ఇచ్చిన కనీస సౌకర్యాలను కూడా మాకు దూరం చేశారు’.. ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

 హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, తన రాజకీయ సహచరులతో సమావేశాలను నిషేధించారని, ఇప్పుడు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని కూడా అడ్డుకున్నారని  చెప్పారు. ‘నన్ను కలవాలనే చట్టబద్ధమైన హక్కును కోరినందుకు నా సోదరి నౌరీన్‌ నియాజీని రోడ్డుపై లాక్కెళ్లారు’.. అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌తో భేటీ అనంతరం ఉజ్మా మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం బాగుంది.. కానీ ఒంటరి నిర్బంధంతో మానసిక చిత్రహింసకు గురవుతున్నారని తెలిపారు. 
 

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు