‘భజనలో.. గోల్డ్‌ మెడల్‌ నీకేపో!’

Published on Tue, 10/28/2025 - 14:03

ఒకవేళ భజన అనే పోటీ గనుక ఒలింపిక్స్‌లో ఉండి ఉంటే.. పాకిస్తాన్‌కు కచ్చితంగా ఆ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ వచ్చి తీరేదేమో!. విన్నర్‌ పోడియంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆ దేశ ప్రధాని  షెహబాజ్‌ షరీఫ్‌ ఉండి ఉండేవారేమో!.. ఈ మాటలు అంటోంది ఆ దేశ మాజీ దౌత్యవేత్త హుస్సేన్‌ హక్కానీ. 

పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై విపరీతమైన ప్రశంసలు గుప్పించాడు. కంబోడియా–థాయ్‌లాండ్ మధ్య తాజాగా కౌలాలంపూర్ ట్రంప్‌ సమక్షంలో శాంతి ఒప్పందం కుదరింది. ఈ నేపథ్యంలో.. శాంతి, స్థిరత్వానికి కృషి చేసే నాయకుండంటూ పాక్‌ ప్రధాని విపరీతమైన పొగడ్తలు గుప్పించారు. 

మొన్న గాజా శాంతి ప్రణాళిక.. ఇప్పుడేమో ఇది. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో శాంతి కోసం ట్రంప్‌ చేసిన కృషి ప్రపంచాన్ని రక్షించింది. లక్షల మంది ప్రాణాలు పోకుండా నిలబెట్టింది అని షెహబాజ్‌ పేర్కొన్నారు.

దీనిపై పాకిస్తాన్ మాజీ అమెరికా రాయబారి హుస్సేన్‌ హక్కానీ, షెహబాజ్ షరీఫ్‌పై వ్యంగ్యంగా స్పందించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ట్రంప్‌ను పొగడటంలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచే స్థాయిలో ఉన్నారంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఫరీద్‌ జకారియా వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘ఇది ఒలింపిక్ క్రీడ అయితే, షరీఫ్‌ పోడియం మీద గోల్డ్ మెడల్‌తో నిలిచేవారు అని అన్నారు. 

ఈజిప్ట్‌లో జరిగిన గాజా శాంతి సదస్సులోనూ షరీఫ్‌ ట్రంప్‌ను విపరీతంగా పొడిగారు. ట్రంప్‌ను శాంతి పురుషుడిగా అభివర్ణిస్తూ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడంటూ మాట్లాడారు. ఆ సమయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చిత్రమైన హవభావాలు ప్రదర్శించడం విపరీతంగా వైరల్‌ అయ్యింది. షరీఫ్‌ మాటలతో కడుపు నిండిపోయిన ట్రంప్‌ ‘ఇక మాట్లాడేం లేదని, ఇంటికి వెళ్లిపోదాం’ అంటూ వ్యంగ్యంఆ స్పందించడం మరో కొసమెరుపు. అయితే షెహబాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యలను పాక్‌ పౌరులే భరించలేకపోయారు. అంతలా దిగజారి పొగడాల్సిన అవసరం ఏముందంటూ.. ప్రధానిని తిట్టిపోశారు కూడా.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)