Breaking News

రాజ్యాంగ సవరణపై పాక్‌లో ఆందోళనలు

Published on Mon, 11/10/2025 - 02:33

ఇస్లామాబాద్‌: ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు విశేషాధికారాలు కట్టబెట్టడంతోపాటు సమూల మార్పులకు ఉద్దేశించిన 27వ రాజ్యాంగ సవరణకు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేయగా, ప్రతిపక్ష పార్టీలు ఆదివారం దేశవ్యాప్త ఆందోళనలకు దిగాయి. రాజ్యాంగ పునాదులనే కదిలించే సవరణలను ఆపివేయాలని డిమాండ్‌ చేశాయి. 27వ రాజ్యాంగ సవరణతో మిలటరీ అధికారం మరింత బలపడనుంది.

ఆర్మీ చీఫ్, ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌కు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల చీఫ్‌గా రాజ్యాంగ గుర్తింపు లభించనుంది. ఫీల్డ్‌ మార్షల్‌గా ఆయన జీవిత కాలం కొనసాగుతారు. దీనివల్ల జీవించి ఉన్నంతకాలం ఆయనపై కేసులు పెట్టకూడదు. సుప్రీంకోర్టు అధికారాలకు సైతం కోత పడనుంది. ఈ బిల్లుపై సోమవారం సెనేట్‌లో ఓటింగ్‌ జరగనుంది. అవసరమైన మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ధీమాతో ఉంది. దీనిపై ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌ సహా ఐదు పార్టీల కూటమి నిరసనలను కొనసాగించాలని నిర్ణయించింది.  

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు