Breaking News

ఉక్రెయిన్​ యుద్ధంలో రష్యాకు పూర్తి మద్ధతు: ఉత్తర కొరియా

Published on Wed, 06/19/2024 - 15:29

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధ‌వారం ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. ఉత్తర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆహ్వానం మేరకు రెండు రోజులు (ఈనెల‌18,19) అక్క‌డ పుతిన్ ప‌ర్య‌టిస్తున్నారు. ప్యోంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్, పుతిన్​కు ఆహ్వానం పలికారు. అనంతరం ప్యోంగ్యాంగ్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

ఉక్రెయిన్​తో యుద్ధం కొన‌సాగుతున్న‌ నేపథ్యంలో రష్యాకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని  కిమ్ హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయ‌డానికి, అమెరికా ఆధిప్య‌త విధానాల‌కు వ్య‌తిరేకంగా పోరేండేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్న‌ట్లు పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మ‌ద్య ఆర్థిక‌, సైనిక స‌హ‌కారాన్ని విస్త‌రించేందుకు అంగీక‌రించిన‌ట్లు తెలిపారు.

యుద్ధంలో తమ పాలసీలకు మద్ధతు ప్రకటించడంపై కిమ్‌కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు సమాచారం.

ఇక‌ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సమయంలో పుతిన్‌ పర్యటనకు రావడం.. అమెరికా సహా దాని మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవ్వించే ఉత్తర కొరియా చేతికి ర‌ష్యా అత్యాధునిక సాంకేతికత అందితే మరింత ప్రమాదమని పశ్చిమ దేశాల్లో ఆందోళన నెలకొంది.

ఇదిల ఉండ‌గా అంతర్జాతీయంగా ఇరుదేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఉత్త‌ర కొరియా ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఈ పరిణామాల నడుమ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియాలో పుతిన్‌ పర్యటించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. కాగా గత ఏడాది సెప్టెంబరులో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యాలో పర్యటించిన సంగ‌తి తెలిసిందే.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు