Breaking News

అమెరికాలో భారతీయ విజయపతాక!

Published on Mon, 08/21/2023 - 04:12

వినూత్న ఆలోచనలతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని భారతీయులు అమెరికాలో సత్తా చాటుతున్నారు. యూనికార్న్‌ స్టార్టప్స్‌ స్థాపించడంలో ప్రవాస భారతీయులు మొదటి స్థానంలో నిలిచారు. 2022 వరకు అమెరికాలో 582 యూనికార్న్‌ స్టార్టప్స్‌ ఏర్పాటు కాగా, అందులో 66 ప్రవాస భారతీయులు ఏర్పాటు చేశారు. అమెరికాలో మొత్తం యూనికార్న్‌ స్టార్టప్స్‌లో ఇండియా, ఇజ్రాయెల్‌కు చెందిన ప్రవాసులు స్థాపించిన కంపెనీలు 20 శాతం ఉన్నాయి.

సాక్షి, అమరావతి: ‘ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’.. ఇదే కోవలో వినూత్న ఆలోచ­నలతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని భారతీయులు అమెరికాలో సత్తా చాటుతున్నారు. భారతీయ విజయపతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తు­న్నారు. యూనికార్న్‌ స్టార్టప్స్‌ స్థాపించడంలో అమెరి­కాలోని భారతీయులు మొదటి స్థానంలో నిలిచారు.

2022 వరకు యూఎస్‌లో 582 యూనికార్న్‌ స్టార్టప్స్‌ ఏర్పాటు కాగా, అందులో 319 స్టార్టప్స్‌ విదేశీయులు/విదేశీ మూలాలున్న వ్యక్తులు స్థాపించినవే. వీటిలో 66 యూనికార్న్‌ స్టార్టప్స్‌ను ప్రవాస భారతీయులు ఏర్పాటు చేయడం విశేషం. వీరిలో ఎక్కువ మంది ఉన్నత చదువుల కోసం యూఎస్‌కు వెళ్లిన వారే కావడం గమనార్హం. అలాగే కొంత మంది బాల్యంలోనే తల్లిదండ్రులతో కలిసి యూఎస్‌కు వచ్చిన వారూ ఉన్నారు. ఈ వివరాలను నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏపీ) తాజాగా వెల్లడించింది.

బిలియన్‌ డాలర్ల కంపెనీలుగా.. 
ఒక స్టార్టప్‌ కంపెనీ విలువ ఒక బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.8 వేల కోట్లు మించి) దాటితే దాన్ని ‘యూనికార్న్‌ స్టార్టప్‌’గా వ్యవహరిస్తారు. ప్రవాస భారతీయులు స్థాపించిన యూనికార్న్‌ స్టార్టప్స్‌లో భారీగా ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. సరాసరి ఒక్కో కంపెనీ 859 ఉద్యోగాలు సృష్టించినట్లు ఎన్‌ఎఫ్‌ఏపీ అధ్యయనంలో తేలింది. అమెరికాలో నంబర్‌ 1 గ్రోసరీ డెలివరీ కంపెనీగా ఉన్న ‘ఇన్‌స్టాకార్ట్‌’ను అపూర్వ మెహతా ఏర్పాటు చేశారు. ఆయన తల్లిదండ్రులు అపూర్వ చిన్నతనంలోనే అమెరికా వెళ్లారు. అక్కడే చదువుకున్న ఆయన తర్వాత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు.


31 శాతం ఇండియా, ఇజ్రాయెల్‌ నుంచే..
కాగా అమెరికాలో మొత్తం యూనికార్న్‌ స్టార్టప్స్‌లో ఇండియా, ఇజ్రాయెల్‌కు చెందిన ప్రవాసులు స్థాపించిన కంపెనీలు 20 శాతం ఉన్నాయి. ఒక్కో యూనికార్న్‌ స్టార్టప్‌కి ఒకరి కంటే ఎక్కువ మంది వ్యవస్థాపకులు ఉన్నారు. వీరిలో ఇండియా, ఇజ్రాయెల్‌కు చెందిన ప్రవాసులు 31 శాతం మంది ఉండటం విశేషం. అలాగే దాదాపు సగం మంది ఇండియా, ఇజ్రాయెల్, యూకే, కెనడా, చైనా దేశాల నుంచే ఉన్నారు. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)