Breaking News

ట్రంప్‌ను టెన్షన్‌ పెడుతున్న ఇజ్రాయెల్‌

Published on Fri, 07/31/2026 - 13:57

అంతా తన ప్లాన్‌ ప్రకారమే సాగుతుందని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అనూహ్యంగా ఓ కొత్త సవాల్‌ ఎదురైంది. సన్నిహిత మిత్రదేశం నుంచే వస్తున్న సంకేతాలు ఇప్పుడు వాషింగ్టన్‌లో చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు కీలక అంతర్జాతీయ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వైఖరి ఈ ప్రక్రియకు పరీక్షగా మారుతోంది.

గాజాలో మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. హమాస్‌, ఇతర సాయుధ గ్రూపులు పూర్తిగా నిరాయుధీకరణకు అంగీకరించాయని, దీనితో శాశ్వత శాంతి దిశగా ముందడుగు పడిందని ఆయన వెల్లడించారు.

ట్రంప్‌ ప్రతిపాదించిన 20 అంశాల ప్రణాళికలో హమాస్‌ ఆయుధాలు వదిలేయడం ప్రధాన అంశంగా ఉంది. ఇప్పటివరకు దీనిపై ప్రతిష్ఠంభన కొనసాగగా.. తాజాగా అంగీకారం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఒప్పందం అమలులో భాగంగా బందీల విడుదల, ఖైదీల మార్పిడి, సైనిక బలగాల క్రమంగా ఉపసంహరణ వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. అయితే ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వైఖరే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఒప్పందం అమలు, భద్రతా హామీలు, భవిష్యత్‌ పరిస్థితులపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని కోరుతోంది. తమ దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.

ట్రంప్‌ దృష్టి మాత్రం ఈ పరిణామాలను దౌత్య విజయంగా మార్చుకోవడంపైనే ఉంది. అమెరికా మధ్యవర్తిత్వంతో దీర్ఘకాలిక పరిష్కారం సాధించాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఒప్పందంలోని నిబంధనలు అమలు కావడం, వాటిపై ఇజ్రాయెల్‌ రాజకీయ వర్గాల స్పందన ఇప్పుడు కీలకంగా మారనుంది.

గాజా పాలనలో హమాస్‌ పాత్ర ఉండకూడదని, ఆయుధ వ్యవస్థలు తొలగించాల్సి ఉంటుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పర్యవేక్షణలో కొత్త పరిపాలనా వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ప్రణాళికలో ఉంది. అనంతరం పాలస్తీనా అథారిటీ సంస్కరణలతో గాజా బాధ్యతలు చేపట్టే అంశం కూడా ఇందులో భాగంగా ఉంది.

అయితే నెతన్యాహు ప్రభుత్వంలోనే ఈ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. కఠిన వైఖరి కలిగిన వర్గాలు ఎలాంటి రాజీ చర్యలనైనా వ్యతిరేకించే అవకాశం ఉంది. దీంతో ట్రంప్‌ ప్రయత్నాలు కేవలం హమాస్‌తో ఒప్పందానికే పరిమితం కాకుండా.. ఇజ్రాయెల్‌ రాజకీయ సమీకరణాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.

మరోవైపు పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై కూడా దృష్టి పెరుగుతోంది. కీలక జలమార్గాల్లో నౌకాయాన రక్షణ కోసం పలు దేశాలు కలిసి మారిటైమ్‌ డిఫెన్స్‌ అలయన్స్‌ను ఏర్పాటు చేశాయి. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర మార్గాల భద్రతకు ఈ కూటమి ప్రాధాన్యం ఇస్తోంది.

ఇప్పుడు అసలు పరీక్ష ఒప్పందం ప్రకటించడం కాదు.. దాన్ని అమలు చేయడమే. ట్రంప్‌ దౌత్య ప్రయత్నాలకు నెతన్యాహు ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది? గాజాలో శాంతి ప్రక్రియ ముందుకు సాగుతుందా? లేదంటే కొత్త అడ్డంకులు ఎదురవుతాయా?.. హమాస్‌ ఏదైనా సడన్‌ ట్విస్ట్‌ ఇస్తుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

ట్రంప్‌ తీవ్రంగా నిరాశ చెందుతారు: అమెరికా అధికారి
ఇజ్రాయెల్‌ తన అంగీకారాలకు కట్టుబడి ట్రంప్‌ 20 అంశాల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని అమెరికా సీనియర్‌ అధికారి కోరారు. ప్రణాళిక అమలుకు ఇజ్రాయెల్‌ సహకరించకపోతే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ “చాలా నిరాశ చెందుతారని” హెచ్చరించారు. బందీల విడుదల, యుద్ధం ముగింపు కోసం కుదిరిన ఒప్పందాన్ని ఇరు పక్షాలు గౌరవించాలని ఆయన అన్నారు. గతంలో అనుమానాలు ఉన్నప్పటికీ హమాస్‌ బందీలను అప్పగించిందని, ఇప్పుడు ఇజ్రాయెల్‌ కూడా తన హామీలను నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)