Breaking News

ఇజ్రాయెల్‌ ప్రధాని కీలక నిర్ణయం.. కుమారుడి పెళ్లి వాయిదా!

Published on Sun, 06/15/2025 - 16:24

దాడులు, ప్రతిదాడులతో ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. పలువురు ఇరాన్‌ సైనిక సారథులు, అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, సైనిక ముఖ్యలను సమాధి చేసిన ఇజ్రాయెల్‌.. ప్రళయ భీకరంగా విరుచుకుపడుతోంది. మరోవైపు, సైన్యాధికారులను కోల్పోయి.. స్థావరాలను కోల్పోయి ఆయుధపరంగా, శాస్త్రవేత్తలను కోల్పోయి విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్‌ కూడా ప్రతికార దాడులకు దిగుతోంది. వందల కోద్దీ డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణులను ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌ సిటీమీదకు ఎక్కుపెడుతోంది.

ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన కుమారుడి వివాహ వేడుకను వాయిదా వేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నెతన్యాహు కుమారుడు అవ్నర్ నెతన్యాహు, అమిత్‌ యార్దేనీకి త్వరలోనే విహహం జరగనుంది. ఈ మెగా వేడుకను నిర్వహించేందుకు నెతన్యాహు కుటుంబం రెడీ అయ్యింది.

అయితే, పశ్చిమాసియాలో చోటు చేసుకున్న యుద్ధ పరిస్థితుల మధ్య నెతన్యాహు తన కుమారుడి పెళ్లి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా, గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల సమయంలో కూడా నెతన్యాహు కుమారుడి పెళ్లి అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. ఆయన ఇంట పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.

 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)