Breaking News

నేపాల్‌కు నిప్పు పెట్టిందెవరు? 

Published on Thu, 09/11/2025 - 06:27

కాఠ్మండు: చేతికి ఆరో వేలుగా అతుక్కుపోయిన స్మార్ట్‌ఫోన్‌లో సోషల్‌మీడియా యాప్స్‌ అనేవి ఓ రకంగా ఆత్మ వంటివి. అలాంటి ఆత్మను చంపేస్తామంటూ ఊరుకోబోమని తెలియజేప్పేందుకే శాంతియుత నిరనస ర్యాలీలు చేపట్టామని నేపాల్‌లోని జెన్‌ జెడ్‌ యువత చెబుతోంది. దేశాన్ని చీడపీడలా తొలిచేస్తున్న అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవనాన్ని ప్రశ్నించేందుకు కదం తొక్కామని, మూడ్రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని జెన్‌ జెడ్‌ విద్యార్థులు, యువజన సంఘాలు స్పష్టంచేశాయి. రాజకీయ అవకాశవాదులు ఉద్యమకారుల మాటున నిరసనకార్యక్రమాల్లో దూరిపోయి నేపాల్‌ను అగి్నగుండంలా మార్చేశారని విద్యార్థులు ఆరోపించారు. 

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి చివరకు ప్రభుత్వాన్ని పడగొట్టాయని, నేపాల్‌లోనూ అదే కుట్ర జరుగుతోందని విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. లూటీలు, దోపిడీలకు తాము ఆమడదూరంలో ఉండిపోయామని, పోలీసులపై రాళ్లదాడి ఘటనలతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ విధ్వంసం వెనుక బయటి శక్తుల హస్తముందని విద్యార్థులు ఆరోపించారు. ఏకపక్షంగా సామాజిక మాధ్యమాలపై ఆకస్మిక నిషేధం వల్ల కలిగే అనర్థాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తెలియజేప్పేందుకే వీధుల్లోకి వచ్చామని, విధ్వంసం చేయడం తమ ఉద్దేశ్యంకాదని స్పష్టంచేశారు.  

మద్దతు పలికిన మాజీ ప్రధాని 
విద్యార్థుల వాదనలకు పరోక్షంగా మాజీ ప్రధాని బాబూరామ్‌ భట్టారాయ్‌ మద్దతు పలికారు. ‘‘నాకు తెల్సిన విద్యార్థులు ఇలాంటి విధ్వంసాలకు అస్సలు దిగరు. వారసత్వ రాజకీయాలు, రాజకీయనేతలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవితం, అవినీతిపై విద్యార్థుల తిరుగుబాటు మొదలైంది. తీరాచూస్తే ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా మరో ‘తిరుగుబాటు’ఆరంభమైనట్లు తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. మేకవన్నె పులులు మీ ఉద్యమ మందల్లో దూరిపోయాయి. వారితో జాగ్రత్త అని మొదట్నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నా’’అని విద్యార్థులను భట్టారాయ్‌ హెచ్చరించారు. 

ఉద్యమంలో బయటిశక్తులనుద్దేశిస్తూ.. ‘నేపాల్‌ ప్రజాస్వామ్య పునాదులనే పెకళించే దుస్సాహసానికి వాళ్లు దిగారు. వాళ్ల తదుపరి దారుణ లక్ష్యం ఏమిటో’’అని ఆందోళన వ్యక్తంచేశారు. సొంత దేశాన్ని తగలబెడుతున్న విద్యార్థులు అంటూ వస్తున్న వార్తలను భట్టారాయ్‌ తప్పుబట్టారు. ‘‘మొసలికన్నీరు కార్చడానికి విద్యార్థులేమీ రాజకీయనేతలు కాదు. అల్లర్లు, ఘర్షణలు చూసి విద్యార్థులే అవాక్కవుతున్నారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని బయటి శక్తులు దురుద్దేశ్యంతో ఉగ్రరూపంలోకి మార్చేశారని విద్యార్థులు బాధపడుతున్నారు. తాజా వినాశనానికి బయటిశక్తులే కారణం’’అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.  

తీవ్రంగా ఖండించిన యువజన, ఎన్‌జీవో సంఘాలు 
హింసాత్మక ఘటనలను యువజన, విద్యార్థి, లాభాపేక్షలేని ప్రభుత్వేతర ఎన్‌జీవోలు ఖండించాయి. ముఖ్యంగా తొలుత శాంతియుత నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించిన జెన్‌ జెడ్‌ నేపాల్, హమీ నేపాల్‌ సంస్థలు ఈ విధ్వంసకాండపై ధ్వజమెత్తాయి. ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశాయి. ‘‘మొదట్నుంచీ విధ్వంసాన్ని మేం అడ్డుకునేందుకే ప్రయతి్నంచాం. వినాశనానికి మాకు వీసమెత్తయినా సంబంధం లేదు. విద్యార్తులెవరూ ఇలా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులను ధ్వంసంచేయలేదు. ప్రధాని, మాజీ ప్రధానులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులతో మాకు ఎలాంటి సంబంధం లేదు’’అని బుధవారం ప్రకటనలో స్పష్టంచేశాయి. ‘‘ఘటనాస్థలికి మేం తర్వాత వచ్చాం. బాధితులను కాపాడాం. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం. 

ప్రజల ఆస్తుల పరిరక్షణకు పాటుపడ్డాం’’అని జెన్‌జెడ్‌ నేపాల్‌ మరో ప్రకటనలో పేర్కొంది. ‘‘సహేతుకమైన, ప్రజాస్వామ్యయుత ఉద్యమపంథాలో సాగుతున్న మమ్మల్ని విధ్వంసకపర్వంలో భాగస్వాములుగా చిత్రించకండి. అధికారమే పరమావధిగా కుట్రలు చేసే రాజకీయ శక్తులు, అవకాశవాదులే ఈ వినాశనానికి సృష్టికర్తలు. మా ఉద్యమానికి తప్పుడు మరకలు అంటించే కుట్రలు జరుగుతున్నాయి. మంచి కోసం పోరాడుతున్న మమ్మల్ని దేశవినాశకారులుగా చిత్రించే కుట్రలు జరుగుతున్నాయి’’అని జెన్‌జెడ్‌ ఆరోపించింది. ‘‘మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదు. కూల్చడం మా పనికాదు. దేశ పునర్‌నిర్మాణమే మా ధ్యేయం. దేశవ్యతిరేక యుద్ధం మేం చేయట్లేము. చెడుకు వ్యతిరేకంగా సాగుతున్న సంఘర్షణలో మాత్రమే విజయం సాధించాలని కోరుకుంటున్నాం. నఖూ జైలును మేం బద్దలుకొట్టలేదు. మాజీ ఉప ప్రధానమంత్రి రవి లమీచ్ఛానేను మేం జైలు నుంచి విడిపించలేదు ’’అని హమీ నేపాల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)