Breaking News

‘నవాజ్‌ షరీఫ్‌ కనుసన్నుల్లోనే పాక్‌ సైనిక దాడులు’

Published on Wed, 05/14/2025 - 21:42

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ను కోలుకోలేని విధంగా చావుదెబ్బ తీసింది. అయితే ఆపరేషన్‌ సిందూర్‌ జరిగే సమయంలో భారత్‌పై పాక్‌ సైనిక దాడికి దిగింది. ఆ దాడికి వ్యూహ రచన చేసింది పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్‌-ఎన్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆజ్మా బుఖారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆజ్మా బుఖారీ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  ఆపరేషన్‌ సిందూర్‌ జరిగే సమయంలో భారత్‌పై పాక్‌ సైనిక దాడికి దిగింది. పాక్‌ సైన్యం.. భారత్‌పై ఎలా దాడి చేయాలనే ప్లాన్‌ మొత్తం నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలో జరిగింది. ఆయన చిన్న స్థాయి నాయకుడు కాదు.. ఆయన చేసిన పనే ఆయన గురించి చెబుతుంది’ అని అజ్మా బుఖారీ వ్యాఖ్యానించారు. 
 
ఇటీవల భారత్‌ మే 7న ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌లో బీభత్సం సృష్టించింది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. వాళ్లకు శిక్షణ ఇచ్చే స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్.. భారత్‌పై మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై ప్రతిదాడికి ప్రయత్నించింది. అయినప్పటికీ భారత్‌ శక్తి, యుక్తులు ముందు అవి తేలిపోయాయి. 

దీంతో పాకిస్తాన్‌ సైన్యంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆజ్మా బుఖారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)