Breaking News

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. ఇజ్రాయిల్‌లోని భారతీయులకు అలర్ట్‌

Published on Sat, 08/03/2024 - 10:58

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై శత్రుదేశాలు దాడికి దిగే అవకాశం కనిపిస్తోంది. హమాస్‌కు చెందిన ఇద్దరు అగ్రనేతలు, హిజ్బుల్లాకు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్ హత్యలతో పశ్చిమాసియాలో ఉద్రి‍క్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మూడు హత్యలలో రెండింటిలో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్, హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే  ఈ మూడు ఇజ్రాయెల్‌పై యుద్దానికి దండెత్తే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

కాగా గత మంగళవారం బీరుట్‌లో హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది.  గత వారం  గోలన్ హైట్స్‌లో జరిగిన ఘోరమైన రాకెట్ కాల్పులకు ప్రతిస్పందనగా ఈ చర్యకు పాల్పడినట్లు టెల్‌ అవీవ్‌ పేర్కొంది. అనంతరం హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. ఇక హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుకూర్ సైతం గత నెలలో లెబనాన్‌లో జరిగిన సమ్మెలో మరణించాడు.

అయితే హమాస్‌, హిజ్బుల్లా నాయకుల తాజా హత్యలతో సిరియా, లెబనాన్‌, ఇరాక్‌, యెమెన్‌లలో ఇరాన్‌ మద్దతిచ్చే గ్రూప్స్‌లో ఉద్రిక్తతలను పెంచింది. దీంతో ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న భారత్‌ వంటి ఇతర దేశాల పౌరులు జాగ్రత్తగా ఉండాలంటూ పశ్చిమాసియా హెచ్చరించింది

ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.  స్థానికంగా ఉద్రిక్తత తీవ్రతరం కావడంతో భద్రతా ప్రోటోకాల్‌ పాటించాలని తెలిపింది. తదుపరి నోటీసు వచ్చేవరకు లెబనాన్‌కు వెళ్లవద్దని బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. లెబనాన్‌ను విడిచి వెళ్లాలని  ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులకు సూచించింది. ఈ క్రమంలోనే ఎయిరిండియా ఇజ్రాయెల్ రాజధాని టెల్ ఆవీవ్‌కు ఆగస్ట్ 8 వరకు విమాన సర్వీసులను నిలిపివేసింది.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)