Breaking News

ఒమన్‌లో నేడు ఇరాన్‌–అమెరికా అణు చర్చలు

Published on Sat, 04/12/2025 - 06:32

మస్కట్‌: ఆకాశహర్మ్యాలు, హంగూ ఆర్భాటాలు కనిపించని ప్రశాంతమైన తీరప్రాంత మస్కట్‌ నగరం పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో భాగమైన కీలక చర్చలకు మరోసారి వేదికగా మారనుంది. తమ అణు కార్యక్రమంపై ఒమన్‌ మధ్యవర్తిత్వంతో ఇరాన్‌ శనివారం అమెరికాతో చర్చలు జరపనుంది. రెండు దేశాల మధ్య అణు కార్యక్రమంపై ఒప్పందం కుదిరే అవకాశాలు పెద్దగా కనిపించకున్నా ఈ చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఒక అంగీకారానికి రాని పక్షంలో ఇరాన్‌ అణు కార్యక్రమం లక్ష్యంగా వైమానిక దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు చేస్తుండటం.. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని మాత్రం ఆపేది లేదని ఇరాన్‌ కరాఖండిగా చెబుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో రెండు దేశాలకు సన్నిహితంగా ఉండే ఒమన్‌ కల్పించుకోవాల్సి వచ్చింది. ట్రంప్‌ కూడా చర్చలకు ఒమన్‌ మధ్యవర్తిత్వంపై అనూహ్యంగా సానుకూలత ప్రకటించారు.  

ఒమన్‌ వైపు మొగ్గు ఎందుకు? 
ఒమన్‌ కీలకంగా వ్యవహరించిన సందర్భా­లు గతంలోనూ ఉన్నాయని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే ‘గల్ఫ్‌ స్టేట్‌ అనాలిటిక్స్‌’సీఈవో జార్జియో కెఫియెరో అంటున్నారు. దౌ­త్య­పరంగా ఒమన్‌ పాత్ర ఎంతో కీలకమైంద­ని పేర్కొన్నారు. చారిత్రకంగా చూసినా ప్ర­పంచ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన గత అనుభవం ఒమన్‌కు ఉందని హైడెల్‌బర్గ్‌ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్‌ మార్క్‌ అంటున్నారు. ఒమన్‌ ప్రజల్లో అత్యధికులు ఇబాదీ ముస్లింలు. 

ఇది సున్నీ–షియా విభజనకు ముందు నుంచీ ఉన్న ఉదారవాద ఇస్లాం శాఖ అని వివరించారు. ఇరాన్‌తో వ్య­వహరించే విషయంలో గత కొన్నేళ్లుగా అమెరికా ప్రధానంగా ఒమన్‌పైనే ఆధారపడుతోందని ఆయన అన్నారు. 2015లో ఇరాన్‌తో అణు ఒప్పందం కుదరటానికి అప్పటి అధ్యక్షు­­డు బరాక్‌ ఒబామాకు రహస్య చర్చల్లో ఒమన్‌ ఎంతో సాయపడిన విషయాన్ని ఆ­యన గుర్తు చేశారు. అయితే, ఆ దేశం ఎప్పు­డూ వార్తల్లో ప్రధానంగా కనిపించేందుకు ప్రయతి్నంచలేదని, కేవలం తెరవెనుక ప్రభావవంతమైన పాత్ర పోషించిందన్నారు.

అమెరికాతో నేరుగా చర్చలు జరపం: ఇరాన్‌ 
అమెరికాతో తాము నేరుగా చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్‌ అంటోంది. అణు కార్యక్రమంపై ఒప్పందం విషయంలో ముందుగా ఒమన్‌ విదేశాంగ మంత్రితో మాట్లాడుతామని, తమ సందేశాన్ని ఆయనే అమెరికా ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌కు అందజేస్తారని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ బద్ర్‌ తెలిపారు. 2015లో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం ఇరాన్‌ 3.67 శాతం శుద్ధి చేసిన యురేనియంను కొద్ది మొత్తంలో మాత్రమే నిల్వ ఉంచుకునేందుకు అవకాశముంది. అయితే, ఆ దేశం వద్ద ప్రస్తుతం 60 శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం పెద్ద మొత్తంలో నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. 

దీంతో, ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటికి వస్తూ ట్రంప్‌ మొదటిసారి అధ్యక్ష పదవిలో ఉండగా ప్రకటించారు. ప్రస్తుతం అణ్వాయుధం తయారీ దిశగా సాంకేతికంగా ఇరాన్‌ అతి సమీపంలో ఉన్నట్లు లెక్క. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ అణు సదుపాయాలపై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఆ దేశంపై ఒత్తిడి తెచ్చే చర్యల్లో భాగంగా హిందూ మహా సముద్రంలోని డీగో గార్సియా మిలటరీ స్థావరానికి ఆరు బీ2 బాంబర్లను తరలించారు. చమురు అన్వేషణ, అణు కార్యక్రమంపై మరిన్ని ఆంక్షలు తప్పవని కూడా ట్రంప్‌ అంటున్నారు. ఇలాంటి హెచ్చరికలు సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని, ఐరాస అణు పరిశీలకులను దేశం నుంచి బహిష్కరించడానికి కైనా వెనుకాడబోమని ఇరాన్‌ అంటోంది. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)