Breaking News

బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్‌ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని

Published on Fri, 03/06/2026 - 16:03

బాల్యంలో చదువుకున్న ‘బంగారు బాతు గుడ్డు’ కథ గుర్తుందా. చైనాలోని ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం గురించి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా మరోసారి గుర్తు రాక మానదు. అసలు స్టోరీ ఏంటీ అంటే. 

చైనాకు చెందిన ఒక కుటుంబానికి ఊహించని అదృష్టం వరించింది. తాము పెంచుకున్న బాతును విందుకోసం వధించారు. అనూహ్యంగా దాని పొట్టలో బంగారాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. దీని విలువ రూ.1.6 లక్షలు ఉంటుందని అంచనా. మెయిన్‌ల్యాండ్ మీడియా అవుట్‌లెట్ జిన్‌వెన్‌ఫాంగ్ నివేదించిన ప్రకారం, ఆ ముక్కలు మొత్తం 10 గ్రాముల బరువు కలిగి ఉన్నాయి. వాటి అంచనా విలువ దాదాపు 12,000 యువాన్లు, అంటే దాదాపు రూ. 1.6 లక్షలు. 

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఈ సంఘటన ఫిబ్రవరిలో హునాన్ ప్రావిన్స్‌లోని లాంగ్‌హుయ్ కౌంటీలో జరిగింది. లియు అనే గ్రామస్థుడు, బాతును వధించిన తర్వాత దానిని శుభ్రం చేస్తున్నప్పుడు చిన్న చిన్న బంగారు ముక్కల్ని గమనించాడు. దీంతో ఇది నిజంగా బంగారమేనా అని నిర్ధారించుకునేందుకు, ఇంట్లోనే బర్నింగ్ టెస్ట్ నిర్వహించాడు. నిజమైన బంగారమే అని తెలిసి సంతోషంగా ఉబ్బితబ్బిబ్బైనాడు. రాబోయే అదృష్టానికి సంకేతంగా లియు తండ్రి అభిప్రాయపడగా, ఇది కొత్తేమీ కాదనీ, ఇంత పెద్ద మొత్తంలో లభించడం మాత్రం ఇదే తొలిసారని కొడుకు  లియూ  చెప్పాడు.

(రూ. 250 కోట్ల భరణం ఆఫర్‌ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్‌)

అయితే బాతులు, ఇతర పక్షులు ఆహారం తీసుకునేటప్పుడు చిన్న రాళ్ళు, ఇసుక లేదా గ్రిట్ మింగడం చాలా కామన్‌. అలా ఒకప్పుడు బంగారు తవ్వకాలతో ముడిపడి ఉన్న నది దగ్గర ఆహారం తీసుకుంటుండగా ఈ బాతు పొట్టలోకి బంగారం చేరి ఉంటుందని విశ్వసిస్తున్నారు.అ యితే ప్రస్తుతం బాతు పొట్టలో దొరికిన బంగారం  ఎవరిది అని నిర్ణయించడం కష్టమంటున్నారు అధికారులు.  1970-1990ల మధ్య కాలంలో, ఈ నది దగ్గర బంగారం కోసం వేట చాలా జోరుగా సాగేది. అయితే, తరువాత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రైవేట్ బంగారు తవ్వకాలను నిషేధించింది.
ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య

#

Tags : 1

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)