Breaking News

Maldives: మోదీకి క్షమాపణ చెప్పాల్సిందే!

Published on Tue, 01/30/2024 - 21:45

మల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు భారతదేశా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయులు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష జుమ్‌హూరీ పార్టీ చీఫ్‌ గసుయిమ్ ఇబ్రహీం డిమాండ్‌ చేశారు. భారత్‌-మాల్దీవుల దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుకునే క్రమంలో అధ్యక్షుడు మొయిజ్జు ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలన్నారు. అధ్యక్షుడు మొయిజ్జు  నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

చైనా అనుకూలమైన వ్యక్తిగా పేరున్న మొయిజ్జు ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు సంబంధిత తీర్మాణంపై సంతకాల సేకరణకు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జుమ్‌హూరీ పార్టీ చీఫ్‌ గసుయిమ్ ఇబ్రహీం భారత్‌కు క్షమాపణ చెప్పాలని చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదేవిధంగా అక్కడి ప్రజలు కూడా సోషల్‌ మీడియాలో తమ అధ్యక్షుడు భారతీయులకు క్షమాపణలు చెప్పాలని ప్రచారం జరుగుతోంది.

చైనా అనుకూల అధ్యక్షుడు ముయిజ్జు కేబినెట్‌లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరిగింది. అయితే నలుగురిలో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ముగ్గురిని తిరస్కరించింది.  దీంతో ఆగ్రహిస్తూ అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు. ఈ పరిణామాలతో ఎండీపీ, మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజ్జుపై అవిశ్వాసం పెట్టాలని సోమవారం నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో మొత్తం 80 మంది సభ్యులకుగాను ఎండీపీకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు.


Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు