Breaking News

ట్రంప్‌ను అంతం చేస్తాం : శవపేటికతో ఇరాన్‌ హోర్డింగ్‌ కలకలం

Published on Thu, 07/16/2026 - 16:47

టెహ్రాన్‌:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ సరికొత్త కుట్రలు పన్నుతోందన్న నిఘా సమాచారం మేరకు ట్రంప్‌ చాలా ఘాటుగా స్పందించారు. తనను హతమార్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే,  ఇరాన్‌ సర్వనాశనం కాక తప్పదని హెచ్చరించారు.  అయితే ఇటీవల ట్రంప్‌, నెతన్యాహూ సహా, 13 మంది నేతల పేర్లతో హిట్‌ లిస్ట్‌ను ప్రకటించింది ఇరాన్‌. తాజాగా  టెహ్రాన్‌లోని ఎంగెలాబ్ స్క్వేర్‌లో డొనాల్డ్ ట్రంప్ శవపేటికలో ఉన్నట్లు చూపుతున్న ఒక భారీ బిల్‌బోర్డ్ (హోర్డింగ్) కలకలం రేపుతోంది. ఈ భారీ బిల్‌బోర్డ్‌లో ట్రంప్ బాడీని ఒక నల్లటి శవపేటికలో ఉన్నట్లు చూపించడం సంచలనంగా మారింది.

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఇరాన్ ట్రంప్‌ను అంతం చేస్తామని ఇరాన్‌పదే పదే చెబుతోంది.  ఆ శవపేటికపై పర్షియన్ , ఇంగ్లీష్ భాషలలో "మేము ట్రంప్‌ను చంపుతాము" (We Will Kill Trump) అని రాసి ఉంది. యుద్ధం ప్రారంభంలో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిని గుర్తుచేస్తూ "మినాబ్ పిల్లల జ్ఞాపకార్థం" అనే నినాదాలు కూడా  ఉండటం గమనార్హం.  

ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌

కొత్తగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో, తెరిచి ఉన్న నల్లటి శవపేటికలోంచి అమెరికా అధ్యక్షుడి మృతదేహం బయటకు తొంగి చూస్తున్నట్లుగా ఉంది. జుట్టు చెదిరిపోయి ఉంది, కళ్ళు, నోరు మూసుకుని ఉన్నాయి. ముందుకు పొడుచుకు వచ్చిన పొట్టపై ఉన్న ఎర్రటి టై మీద అతని చేతులు ఉన్నాయి. పాదాలు నిటారుగా పైకితేలి ఉన్నాయి.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్  సుప్రీంలీడర్‌ అలీ ఖమేనీ మరణించారు. ఈ దాడుల్లో  ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, మనవడు కూడా మరణించారు. వీరితోపాటు ఇరాన్ రక్షణ మంత్రి అమీర్‌ నసీర్జాదే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్‌పూర్ తదితర కీలక సైనిక, రాజకీయ నాయకులు కూడా హతమయ్యారు.  ఈ ఘోర హత్యలు ఇరాన్‌ ప్రజల్లో, ప్రభుత్వంలో ప్రతీకార జ్వాలలు రగిలిస్తున్నాయి. తమ నేతల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞచేసిన ఇరాన్‌ వ్యూహంలో భాగంగానే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో విప్లవాత్మక చిత్రాలు, యుద్ధ స్మారకాలు , సైనిక శక్తిని ప్రదర్శించే ఇలాంటి భారీ బిల్‌బోర్డ్‌లను ఏర్పాటు చేస్తోంది.

ఇదీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్‌, మరో ఇద్దరు భారతీయ నిపుణులు

కాగా ఇరాన్ బిల్‌బోర్డులపై బెదిరింపు లేదా  వ్యంగ్య చిత్రాలు కొత్తేమీ కాదు. మే నెలలో, పాశ్చాత్య, ముఖ్యంగా అమెరికన్ ప్రేక్షకులను లక్ష్యంగా  ఒక ద్విభాషా బిల్‌బోర్డులో, ట్రంప్ నోటికి కుట్లు వేసినట్లుగా, దానిపై హోర్ముజ్ జలసంధి చిత్రాన్ని, దాని పక్కన "ది బ్రేకింగ్ పాయింట్" అన్న బోర్డులను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: ఏకంగా 10 అడుగుల కోబ్రా : చున్నీలా మెడలో చుట్టేసుకుంది

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)