Breaking News

ఆప్ఘన్‌, పాక్‌ యుద్ధం.. భారత్‌పై ఖవాజా ఆసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 02/27/2026 - 09:26

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌, తాలిబన్ల ఆఫ్ఘనిస్థాన్‌ సైన్యం మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆప్ఘన్‌పై బహిరంగ యుద్ధం ప్రారంభించినట్లు పాకిస్తాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సోషల్‌ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఖవాజా.. భారత్‌పై మరోసారి అక్కసును వెళ్లగక్కారు.

అయితే, ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్తాన్‌ దాడుల నేపథ్యంలో పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌.. ‘మా సహనం నశించింది. ఇప్పుడు మాకు.. మీకు మధ్య బహిరంగ యుద్ధమే’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో ప్రస్తుతం తాలిబన్‌లకు సంబంధాలు లేవన్నారు. మరోవైపు, ఖవాజా.. భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ, కాబూల్ కలిసి పాకిస్తాన్‌పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నాయని ఫ్రాన్స్ 24 ఇంటర్వ్యూలో అన్నారు. భారతే.. తమపై ఆప్ఘన్లు దాడులు చేసేలా ప్రేరేపించిందన్నారు. కానీ, భారత్‌ దానిని అంగీకరించరు. భారత్‌.. కాబూల్‌తో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఆప్ఘన్‌.. భారత్‌కు వలస రాజ్యంగా ఉందన్నారు. అయితే, దీనిపై ఎలాంటి ఆధారాలు చూపలేకపోయినా, భారత్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలను అనుమానాస్పదంగా పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి నుంచే ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్తాన్‌ వైమానిక దాడులు ప్రారంభించింది. దీనికి ‘ఆపరేషన్‌ గజబ్‌ లిల్‌ హక్‌’గా పేర్కొంది. కాబుల్‌, కాందహార్‌, పక్తియా ప్రావిన్స్‌లలో వైమానిక దాడులు జరిగాయని ఆప్ఘన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించారు. పాక్‌పై చేపట్టిన దాడుల్లో 55 మంది ఆ దేశ సైనికులు చనిపోయారని ఆఫ్ఘనిస్థాన్‌ ప్రకటించింది. అయితే, ఇస్లామాబాద్‌ దీన్ని తోసిపుచ్చింది. ఘర్షణల్లో ఇద్దరు పాక్‌ సైనికులు మరణించారని, మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొంది. ఇస్లామాబాద్‌ సైనికుల నిర్బంధంపై తాలిబన్లు చేసిన ప్రకటనను పాక్‌ ప్రభుత్వ ప్రతినిధి మోషరఫ్ అలీ జైదీ ఖండించారు. ఆప్ఘన్‌ సైనికులే 133 మంది మరణించారని.. 200 మందికి పైగా గాయపడ్డారన్నారు. తొమ్మిది మంది సైనికులను నిర్బంధించినట్లు తెలిపారు. ఇటీవల తమపై జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్‌పై అఫ్గాన్‌ విరుచుకుపడింది.

డ్యూరాండ్‌ రేఖ వివాదం..
ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్తాన్‌ మధ్య 2,611 కిలోమీటర్ల సరిహద్దు అయిన డ్యూరాండ్‌ రేఖను ఆఫ్ఘనిస్థాన్ అధికారికంగా ఎప్పుడూ గుర్తించలేదు. పాకిస్తాన్ దీనిని అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా ఉంది. ఈ క్రమంలో 2025 అక్టోబర్‌లో జరిగిన సరిహద్దు ఘర్షణల్లో డజన్ల కొద్దీ సైనికులు, పౌరులు, మిలిటెంట్లు మరణించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)