Breaking News

అంతరిక్షపుటంచు నుంచి... 

Published on Sat, 03/07/2026 - 05:19

నిత్యం కట్టుదిట్టమైన భద్రత మధ్య అప్రమత్తంగా ఉండే ఇరాన్‌ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్‌ సైన్యం అత్యంత కచి్చతత్వంతో కూడిన దాడికి పాల్పడి హత్య చేసింది. 37 ఏళ్లపాటు ఇరాన్‌ను ఒంటిచేత్తో ఏలిన ఖమేనీ కథ చివరకు విషాదంగా ముగిసింది. గత 28న రాజధాని టెహ్రాన్‌లో నడి»ొడ్డున అత్యున్నత స్థాయి సమావేశంలో ఉండగా జరిగిన దాడిలో మరణించారు.

 అసలీ దాడి ఎలా జరిగింది, ఖమేనీ అంతం చూసేందుకు ఇజ్రాయెల్‌ ప్రయోగించిన ఆయుధం ఏమిటనేవి చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్‌ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి లక్ష్యం సాధించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మిసైల్‌ను ‘రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌’ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది అత్యంత ప్రాణాంతక ఆయుధమని చెప్పుకోవచ్చు. ఒక్కసారి లక్ష్యం వైపు దూసుకెళ్లిందంటే దాన్ని మధ్యలో అడ్డుకోవడమే అసాధ్యమే. గురి తప్పే ప్రసక్తే లేదు. శత్రువు నేల కూలాల్సిందే! 

అసలేమిటి నీలి పిచ్చుక?  
మూడు బాలిస్టిక్‌ టార్గెట్‌ క్షిపుణుల కుటుంబంలో బ్లూ స్పారో కూడా ఒకటి. ఇందులో బ్లాక్‌ స్పారో, సిల్వర్‌ స్పారో కూడా ఉన్నాయి. మరో ఖండంలో సుదూరంలోని లక్ష్యాలను ఛేదించడానికి బాలిస్టిక్‌ క్షిపణులను ఫైటర్‌ జెట్‌ లేదా రాకెట్‌కు అమర్చి ప్రయోగిస్తారు. గాల్లోకి లేచిన క్షిపణి తర్వాత ఫైటర్‌ జెట్‌ నుంచి విడిపోయి భూ వాతావరణపు అంచుల దాకా వెళ్తుంది. తర్వాత గురుత్వాకర్షణ శక్తితో భూమి దిశగా ప్రయాణించి లక్ష్యాన్ని తాకి పేలిపోతుంది. ఇది ఒక బంతిని గాల్లోకి విసరడం లాంటిదే. పైకి వెళ్లిన బంతి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మళ్లీ భూమిని తాకుతుంది. అందుకే దీన్ని ‘అంతరిక్ష క్షిపణి’గా కూడా పిలుస్తుంటారు. 

నిజానికి బ్లూ స్పారో, బ్లాక్‌ స్పారో, సిల్వర్‌ స్పారో క్షిపణులను ఇజ్రాయెల్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌లో భాగంగా ప్రాక్టీస్‌ కోసం అభివృద్ధి చేశారు. శత్రుదేశాల బాలిస్టిక్‌ క్షిపణులను ముందే గుర్తించి, నేలమట్టం చేయడం ఈ డిఫెన్స్‌ సిస్టమ్‌ విధి. ఇక్కడ శత్రుదేశాల క్షిపణుల స్థానంలో స్పారో మిస్సైళ్లను డమ్మీగా ఉపయోగించి, ప్రాక్టీస్‌ చేస్తుంటారు. యుద్ధ రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. బ్లూ స్పారో పొడవు 6.51 మీటర్లు. బరువు 1,900 కిలోలు. సింగిల్‌ స్టేజ్‌ సాలిడ్‌ రాకెట్‌ ప్రొపెల్లెంట్‌ రాకెట్‌ ఉంటుంది. జీపీఎస్‌తోపాటు ఐఎన్‌ఎస్‌ నావిగేషన్‌ సిస్టమ్‌తో ముందుకెళ్తుంది. బయటి నుంచి అందే సిగ్నల్‌తో పనిలేకుండా తన కదలికలు నిర్దేశించుకోగలదు. బ్లూ స్పారో మిస్సైల్‌ లండన్‌ బస్సు పరిమాణంలో ఉంటుంది.  

బ్లూ స్పారో స్ఫూర్తితో ‘రాక్స్‌’   
ఇతర దేశాల అత్యాధునిక క్షిపణులకు దీటుగా బ్లూ స్పారోను డిజైన్‌ చేశారు. భూవాతావరణాన్ని దాటి ముందుకెళ్లి, మళ్లీ భూవాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని తాకడం ఈ నీలి పిచ్చుక ప్రత్యేకత. ఫైటర్‌ జెట్‌కు అమర్చిన బ్లూ స్పారో ఆకాశంలో భూవాతావరణం పరిధి వరకూ వెళ్లి విడిపోతుంది. అలాగే పైకి దూసుకెళ్లి భూవాతావరణం అంచును దాటేస్తుంది. పేలుడు పదార్థాలు కూర్చిన క్షిపణి ముందుభాగం వెనుక భాగం నుంచి విడిపోయి భూమి దిశగా వేగంగా ప్రయాణిస్తుంది. అలా కిందికి వచ్చే భాగాన్ని రీ–ఎంట్రీ వెహికల్‌ అంటారు. ఇందులో వార్‌హెడ్‌తోపాటు చిన్నపాటి థ్రస్టర్లు ఉంటాయి. శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేని రీతిలో నిట్టనిలువుగా కిందికి వచ్చి అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. 

‘ఆపరేషన్‌ రోరింగ్‌ లయన్‌’లో భాగంగా ఫిబ్రవరి 28న ఉదయం టెహ్రాన్‌లో ఖమేనీ నివాసాన్ని బ్లూ స్పారో ఇదే తరహాలో ధ్వంసం చేసింది. ప్రాక్టీస్‌ కోసం అభివృద్ధి చేసిన ఒక మిస్సైల్‌ ఇరాన్‌ సుప్రీంలీడర్‌ను బలి తీసుకుంది. రఫేల్‌ సంస్థ బ్లూ స్పారో డెవలప్‌మెంట్‌తోనే ఆగిపోలేదు. సరిగ్గా ఇదే టెక్నాలజీతో ‘రాక్స్‌’ను అభివృద్ధి చేసింది. ప్రతికూల వాతావరణంలో సైతం అసాధారణమైన కచి్చతత్వంతో లక్ష్యాలను ఛేదించడం రాక్స్‌ క్షిపణుల ప్రత్యేకత. శత్రుదేశాలు జీపీఎస్‌ సిగ్నల్స్‌ను జామ్‌ చేసినా సరే ఈ క్షిపణులు సరిగ్గా పనిచేస్తాయి. భూఉపరితలంతోపాటు అంతర్భాగంలోని లక్ష్యాన్ని తాకుతాయి. 500 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. బ్లూ స్పారో ఒక స్కెచ్‌(చిత్తుప్రతి) అనుకుంటే రాక్స్‌ అనేది పూర్తిగా సిద్ధమైన ఆయుధం.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌
 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)