Breaking News

తలదూర్చితే చావుదెబ్బ తప్పదు.. ట్రంప్‌కు ఖమేనీ వార్నింగ్!

Published on Wed, 06/18/2025 - 21:31

తెహ్రాన్‌: హెచ్చరికలు,అల్టిమేట్టంలు ఆఖరికి చంపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు‌ బెదిరింపులకు దిగినా సరే వెనక్కి తగ్గబోమని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ(83) ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు.  

ఇజ్రాయెల్‌ భీకర దాడుల్లో ఖమేనీ తన సన్నిహితులతో పాటు సైన్యంలో కీలక పాత్రపోషిస్తున్న అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో ఖమేనీ లొంగిపోవాలని నెతన్యాహు,ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఆ బెదిరింపులకు తానేమి లొంగిపోనని, కాదు కూడదని ఇజ్రాయెల్-ఇరాన్‌ యుద్ధంలో తలదూర్చాలని చూస్తే కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ట్రంప్‌కు వార్నింగ్‌ ఇచ్చారు.

ఎక్స్‌ వేదికగా ఖమేనీ ఏమన్నారంటే?
ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదు. కాదు కూడదని సైనిక పరంగా జోక్యం చేసుకుంటే మాత్రం అమెరికాను కోలుకోలేని విధంగా దెబ్బకొడతామని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ గురించి ఖమేనీ స్పందించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన అవివేకంతో ఇరానియన్లు తనకు లొంగిపోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ట్రంప్‌ ఎవరికో (ఇజ్రాయెల్‌ దేశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ) భయపడి తమను బెదిరిస్తే.. తాము బెదిరిపోమని పునరుద్ఘాటించారు. పదేపదే అమెరికా కవ్వింపు చర్యలకు దిగితే ప్రస్తుతం ఇజ్రాయెల్‌ నుంచి ఇరాన్‌ ఎదుర్కొంటున్న హానికంటే ఎక్కువ హాని అమెరికా ఎదుర్కొవాల్సి ఉంటుందని ఇరాన్‌ అమెరికాకు చేయబోయే నష్టం గురించి హెచ్చరించారు.  

ఖమేనీని చంపే ఉద్దేశం మాకు లేదు.. కానీ 
సుప్రీం లీడర్ అనే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు. అతని ఆచూకీ పెద్ద కష్టమేమీ కాదు. అతను అక్కడ సురక్షితంగా ఉన్నాడు. ప్రస్తుతం  మేం అతన్ని చంపే ఉద్దేశంతో లేము. ఖమేనేని చంపితే మా వారిపై దాడులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నాకు ఓపిక నశిస్తున్నది. ఖమేనీ భేషరతుగా లొంగిపోతే మంచిది. మా సహనాన్ని పరీక్షించొద్దు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ట్రంప్ ట్వీట్‌పై ఖమేనీ పైవిధంగా స్పందించారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)