Breaking News

కెనడియన్‌ సిటిజన్‌ షిప్‌ వేడుక : చీరలో ‘దివ్య’ ముస్తాబు

Published on Tue, 01/27/2026 - 16:44

ఏదైనా ప్రత్యేక సందర్భం అనగానే మహిళలకు ముందుగా గుర్తొచ్చే దుస్తులు చీర.   అలా కెనడా పౌరసత్వం తీసుకునే సందర్భంగా మహారాష్ట్రకు  చెందిన మహిళ  ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా నిలిచిపోవాలని భావించింది. తమ ప్రాంతానికి చెందిన  చీర,  ముస్తాబులో  స్పెషల్‌గా కనిపించాలని నిర్ణయించుకుంది. దీనికి  సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది పలువురిని ఆకట్టుకుంటోంది.

మహారాష్ట్రకు చెందిన  దివ్య లాట్లికర్ కెనడా పౌరసత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి నౌవారీ చీరతో హాజరై అందర్నీ ఆకర్షించారు. తన సొంత రాష్ట్రం నుండి వచ్చిన సాంప్రదాయ చీరను ధరించి, నుదిటిపై బిందీతో ముస్తాబైంది. ఈ వేడుకును ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచకుంది. నౌవారీ చీర ధరించడం తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ చీర బలం, గౌరవం, సహనం, కొనసాగింపుకు చిహ్నం అని ఆమె అన్నారు. పౌరసత్వ ప్రమాణాన్ని స్వీకరిస్తూ, సర్టిఫికేట్  అందుకుంటున్న ఆ క్షణం ఆమెలో  ఇన్నేళ్ల కృషి, సంకల్పం ప్రతిబింబించింది.

ఇదీ చదవండి: నిపా వైరస్‌ కలకలం : ఎయిర్‌పోర్ట్స్‌లో హై అలర్ట్‌
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకుంటూ, దివ్య దేశం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. తాను ఉన్న చోట ఉండటం గర్వంగా ఉందని, అలాగే ఏ దేశమేగినా, పుట్టిన నేలను మర్చిపోకూడదని, మూలాలను సజీవంగా ఉంచుకోవడం  తనకెంతో గర్వకారణమని  వ్యాఖ్యానించారు.  

 ఆ వేడుకలో ఆమె ధరించిన  చీర, సాంప్రదాయ వేషధారణపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసలు కురిపించారు. చాలా సహజంగా, అందంగా ఆత్మవిశ్వాసంతో కనిపించారంటూ  దివ్యను కొనియాడారు. అచ్చమైన మరాఠీ అమ్మాయిలా ఉన్నారన్నారు. అలాగే తన అమెరికా పౌరసత్వ స్వీకరణ సందర్బంగా తాను కూడా మరాఠీ దుస్తులు ధరిస్తానని, మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్‌ అంటూ మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. 
 

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)