జేడీవాన్స్‌కు యూజర్‌ చురక.. నెట్టింట రచ్చ

Published on Mon, 12/08/2025 - 17:11

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఒక అమెరికన్ మాస్టర్ స్ట్రోక్‌ ఇచ్చారు. అమెరికా పాత వలస విధానం ఆ దేశ ఆశలను హరిస్తుందని అమెరికన్ల అవకాశాలను వలస కార్మికులు కొట్టేస్తున్నారని వాన్స్ ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన ఓ అమెరికన్ నీభార్య పిల్లలు కూడా అమెరికన్లు కాదు వారు కూడా అమెరికన్ల అవకాశాలు దొచుకెళ్తున్నారు అని కౌంటరిచ్చారు. పాటు మరికొందరూ ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస కార్మికులపై గుర్రుగా ఉన్నారు. విదేశీ కార్మికులు అమెరికన్ల అవకాశాలను లాగేస్తున్నారని వారిని దేశంలోకి రాకుండా నియంత్రించాలనడంతో పాటు ఇమిగ్రేషన్ పాలసీ కఠినతరం చేశారు. అంతేకాకుండా   విదేశీయులకు వ్యతిరేకంగా పలు రకాల చర్యలు చేపట్టారు. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షుడు సైతం అదే జాబితాలో చేరారు. అమెరికన్ల అవకాశాలను విదేశీయులు దొచుకెళుతున్నారంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

"అమెరికా పాత మైగ్రేషన్ విధానం అమెరికా కలలను దొంగిలించింది. దానివల్ల దేశస్థులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. అమెరికన్లు నుంచి వారు ఉద్యోగాలు దొంగిలించి వారు ధనవంతులయ్యారు" అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్టుకు కౌంటర్ గా చాలా మంది రీపోస్టులు చేశారు. 

"మీ కుటుంబం విదేశీయులు కాదా అది వలస కుటుంబం కాదా" అని ఒకరు అన్నారు. "మీ భార్య,పిల్లలు కూడా అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారు" అని మరో యూజర్ పోస్ట్ చేశారు. "మీఅత్తమామలు ద్వేషిస్తున్నావు" అని ఒక యూజర్ వ్యంగ్యంగా రీపోస్ట్ చేశారు. ఇలా అమెరికా ఉపాధ్యక్షుడు సోషల్ మీడియాలో ట్రోలయ్యారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 2014లో భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కాగా వారి కుమారుడికి వివేక్ అని నామకరణం చేశారు. ఉషా వాన్స్ వృత్తి రీత్యా లాయర్.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)