ట్రంప్‌కు పుతిన్‌ భయపడ్డారా?

Published on Sun, 08/11/2024 - 21:26

న్యూయార్క్‌: అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో దేశంపై యుద్ధం చేయలేదని రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి, సెనేటర్‌ జేడీ వాన్స్ అన్నారు. ఆయన ఆదివారం సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా, రష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

చైనాను పోటీదారుగా, ప్రత్యర్థిగా గుర్తిస్తూ ఆ దేశాన్ని ఎదుర్కొవడానికి గల బలమైన అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుకుంటుందని అన్నారు. చైనాను నిరోధించగల అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటే మా టార్గెట్‌గా భావిస్తున్నాం. మేము చైనాతో యుద్ధానికి చేయకూడదని అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా చైనా మకు విరోధి దేశమే. ఆ విషయం చైనీయులకు కూడా తెలుసు. 

చైనా టన్నుల కొద్దీ ఫెంటానిల్‌ను తయారు చేస్తుందిని, అమెరికాలోకి అనుమతిస్తున్నారు. అయితే డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఈ విషయంలో ఏమీ చేయలేదని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ కార్మికులతో కూడిన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఉంది. చైనాను వాణిజ్యపరంగా ఎదుర్కొవల్సి వస్తే.. పోరాడి గెలుస్తాం. కానీ కమలా హారిస్ చేసిన పనిని మేము చేయలేము. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మంచి సంబంధాలను కలిగి ఉన్నందుకు కమలా హారిస్‌తో సహా డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి చేశారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, వ్లాదిమిర్ పుతిన్ మరో దేశంపై యుద్ధం చేయలేదని వాన్స్‌ అన్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)