Breaking News

ట్రంప్‌ గద్దె దిగడమా, నాన్సెన్స్‌!

Published on Sun, 06/08/2025 - 05:29

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ వివాదంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ స్పందించారు. అధ్యక్షునితో తలపడటం ద్వారా ఆయన పెద్ద తప్పిదం చేస్తున్నారన్నారు. ఎప్‌స్టీన్‌ లైంగిక కుంభకోణంతో ట్రంప్‌కు సంబంధముందని, ఆయన గద్దె దిగి వాన్స్‌ అధ్యక్షుడు కావడం ఖాయమని మస్క్‌ పేర్కొనడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ‘నాన్సెన్స్‌’అంటూ వాన్స్‌ శుక్రవారం కొట్టిపారేశారు. 

అధ్యక్షునిగా ట్రంప్‌ అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. ఆయనపై మస్క్‌ ఆరోపణలను ఖండించారు. ‘‘ఇలాంటి గొడవలు అందరి విషయంలోనూ జరుగుతుంటాయి. అందులోనూ మస్క్‌ చాలా ఎమోషనల్‌. కాస్త నెమ్మదించారంటే అంతా సర్దుకుంటుంది. కొంతకాలానికి ఆయనే మా వద్దకు తిరిగొస్తారు’’అని అభిప్రాయపడ్డారు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరుందంటూ చేసిన ఎక్స్‌ పోస్టులను మస్క్‌ తాజాగా తొలగించారు. అయితే, ‘ఆ పోస్టులను ఫ్యూచర్‌ రిఫరెన్స్‌ కోసం దాచిపెట్టుకోండి’అంటూ భావగర్భితంగా పోస్ట్‌ చేశారు. 

మరోవైపు, మస్‌్కతో తాను మాట్లాడబోతున్నానంటూ వచి్చన వార్తలను ట్రంప్‌ ఖండించారు. ‘‘ఆ మతి చెడిన మనిíÙతోనా? అలాంటి ఉద్దేశమేదీ నాకు లేదు. నిజానికి మస్కే నాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. నేనే పట్టించుకోలేదు’’అని స్పష్టం చేశారు. అంతేగాక ఆయన కంపెనీలకు ప్రభుత్వం కట్టబెట్టిన కాంట్రాక్టులన్నింటినీ పూర్తిగా సమీక్షిస్తానని ప్రకటించారు. ‘‘అంతా నిబంధనల మేరకే ఉంటే ఓకే. లేదంటే ఏం చేయాలో ఆలోచిస్తాం’’అని స్పష్టం చేశారు. 

మస్క్‌ కంపెనీలపై గతంలో జరిగిన విచారణలను తిరగదోడతారా అని ప్రశ్నించగా, ‘‘అలాంటివి జరిగాయా? నాకు తెలియదు. అదే నిజమైతే ఏం జరగాలో అదే జరుగుతుంది’’అంటూ స్పందించారు. ‘‘చైనా, రష్యా, ఇరాన్‌ వంటి అంతర్జాతీయ అంశాలతో నేనిప్పుడు యమా బిజీగా ఉన్నా. మస్క్‌ గురించి ఆలోచేంచే తీరిక కూడా లేదు. మస్కే కాదు, ఒక్క నేను తప్ప ఎవరున్నా లేకున్నా అమెరికాకు వచి్చన లోటేమీ లేదు’’అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మిడ్‌ టర్మ్‌ ఎన్నికల్లో ట్రంప్‌ డెమొక్రాట్లకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.  

మస్క్‌ కొత్త పార్టీ! 
ట్రంప్‌తో రగడ నేపథ్యంలో మస్క్‌ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్టు కని్పస్తోంది. 80 శాతం మంది అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందంటూ ఎక్స్‌లో ఆయన ఒపీనియన్‌ పోల్‌ పెట్టడం తెలిసిందే. దాన్ని 80 శాతం మంది సమరి్థంచినట్టు శుక్రవారం మస్క్‌ ప్రకటించారు. ‘‘80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే పారీ్టకి 80 శాతం మద్దతు. విధి అంటే ఇదేనేమో!’’అని ఒక పోస్టులో ఆయన హర్షం వెలిబుచ్చారు. ఆ వెంటనే ‘ద అమెరికా పారీ్ట’అంటూ మరో పోస్ట్‌ పెట్టారు. అది ఆయన పెట్టబోయే కొత్త పార్టీ పేరు కావచ్చని భావిస్తున్నారు. మస్క్‌ రష్యాలో స్థిరపడాలనుకుంటే రెడ్‌కార్పెట్‌ పరుస్తామని ఆ దేశ చట్టసభ డ్యూమా సభ్యుడు ద్మిత్రీ నొవికోవ్‌ ప్రకటించారు. ఆయన కోరితే రాజకీయ ఆశ్రయం కల్పిస్తామన్నారు. అయితే ట్రంప్‌–మస్క్‌ రగడపై స్పందించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ నిరాకరించారు.   

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)