Breaking News

ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు

Published on Sun, 01/12/2025 - 11:44

వాషింగ్టన్‌ :  అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (donald trump) ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురూ అయ్యాయి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధిత విభాగం ఆయా దేశాలకు ఆహ్వానం పంపుతోంది. తాజాగా భారత్‌ (india)కు సైతం ఆహ్వానం  

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకార చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనాలంటూ భారత్‌కు ఆహ్వానం అందింది. భారత్‌ తరుఫున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ (S Jaishankar) హాజరు కానున్నారు.

గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.  ఈ సందర్భంగా ‘ట్రంప్-వాన్స్ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు, విదేశాంగ మంత్రి డాక్టర్  జైశంకర్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.’ అని కేంద్రం వెల్లడించింది.  అమెరికా పర్యటనలో ట్రంప్‌తో పాటు, ఇతర నేతలు, రాజకీయేతర ప్రముఖుల్ని సైతం కలవనున్నారు.  

క్యాపిటల్ భవనం ముందు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ప్రసంగిస్తారు. ప్రమాణ స్వీకారానికి జో బైడెన్ హాజరుకానున్నారు. కాగా,  2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్.. జోబైడెన్‌ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు.  

ట్రంప్ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రపంచ నేతలను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించినట్లు సమాచారం 

👉చదవండి : నా ఉరిశిక్షను రద్దు చేయండి.. కోర్టుకు ట్విన్‌ టవర్స్‌ దాడి మాస్టర్‌మైండ్‌ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)