Breaking News

భారత గడ్డపై అడుగుపెట్టిన జపాన్‌ ప్రధాని

Published on Thu, 07/02/2026 - 02:23

జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన జూలై ఒకటి నుంచి 3 వరకు కొనసాగనుండగా.. ఇందులో భారత్-జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు భారత్కు వచ్చిన సనాయే తకైచి.. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ వ్యూహం తదితర అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. 

అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా అభిప్రాయాలు పంచుకోనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత సనాయే తకైచి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనతో భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి