Breaking News

‘మీరు.. వెనెజువెలాలో ఏం జరిగిందో చూశారుగా..’

Published on Tue, 01/06/2026 - 12:17

నిన్న మొన్నటి వరకూ ఇరాన్‌ లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయిల్‌.. ఇప్పుడు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.  వెనెజువాలాలో గత వారంగా జరుగుతున్న పరిణామాలు  ఉదహరిస్తూ ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చింది. ‘ మీరు దారికి రాకపోతే వెనెజువెలాలో ఏం జరిగిందో అదే జరుగుతుంది’ అని ఇజ్రాయిల్‌ ప్రతిపక్ష నాయకుడు యేర్‌ లాపిడ్‌ పేర్కొన్నారు..

అమెరికా సైన్యం.. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్‌ మడురోను అరెస్ట్‌ చేసిన ఘటనను ఉదాహరణగా చూపిస్తూ,ఇరాన్‌ పాలకులు వెనిజులాలో జరుగుతున్న పరిణామాలను గమనించాలి” అని స్పష్టంగా పేర్కొన్నారు.  దీని ఫలితంగా అమెరికా ఒక దేశాధ్యక్షుడిని అరెస్ట్‌ చేయగలిగితే, ఇరాన్‌ పాలకులు కూడా ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చనే సంకేతాలు పంపారు లాపిడ్‌. ఇది ఇరాన్‌క ఒక హెచ్చరిక లాంటిదిగా పేర్కొన్నారు. ఇరాన్‌ పాలకులు తమ చర్యలకు  గణనీయమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ భేటీ తర్వాత.. వెనెజువాలాపై అగ్రరాజ్యం దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడైన మదురోను నిర్బంధించింది. ఆయనపై నార్కో-డ్రగ్స్‌ ముద్ర వేసి న్యూయార్క్‌లో తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్‌ను ఇజ్రాయిల్‌ ప్రతిపక్ష నాయకుడు హెచ్చరించడం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే.. తమపై దాడికి దిగితే అందుకు మూల్యం భారీగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్‌కు మాటల ప్రతిదాడికి దిగింది. 

ఒకవేళ అమెరికాతో తమపై యుద్ధానికి దిగితే కచ్చితంగా తిప్పి కొడతామని ఇరాన్‌ పార్లమెంట్‌ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. తాము మీ దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.  ఈ తాజా పరిణామాలు  ఇజ్రాయిల్‌-ఇరాన్‌ల మధ్య మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు విశ్లేషకులు..

#

Tags : 1

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)