ఇజ్రాయెల్‌కు ఐరన్‌ బీమ్‌ రక్షణ ఛత్రం

Published on Tue, 12/02/2025 - 05:38

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇప్పటికే ఐరన్‌ డోమ్‌ రక్షణ ఛత్రం ఉండగా, తక్కువ ఖర్చుతో లేజర్‌ వ్యవస్థ ‘ఐరన్‌ బీమ్‌’ను త్వరలో సమకూర్చుకోనుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ రక్షణ శాఖలోని పరిశోధన అభివృద్ధి విభాగం చీఫ్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ డేనియల్‌ గోల్డ్‌ సోమవారం చెప్పారు. ‘ఐరన్‌ బీమ్‌ అభివృద్ధి పూర్తయింది, ఈ వ్యవస్థ సామర్థ్యాలను ధ్రువీకరించే సమగ్ర పరిశీలన సైతం ముగిసింది. 

డిసెంబర్‌ 30న ఇజ్రాయెల్‌ మిలటరీకి అందించడానికి సిద్ధంగా ఉన్నాం’అని వివరించారు. దీంతోపాటు తదుపరి తరం ఆయుధ వ్యవస్థల అభివృద్ధి సైతం కొనసాగుతోందన్నారు. రాకెట్లు, శతఘ్నులు, డ్రోన్ల వంటివాటితో ఎదురయ్యే గగనతల ముప్పును ఎదుర్కోవడానికే ఈ భూ ఆధారిత హై–పవర్‌ లేజర్‌ వైమానిక రక్షణ వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. ఈ వ్యవస్థ యుద్ధరంగంలో పోరాటం తీరునే మార్చేస్తుందని గోల్డ్‌ ప్రకటించారు.

 ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు తమకు దశాబ్ద కాలం పట్టిందన్నారు. భవిష్యత్తు సంఘర్షణల కోసం అద్భుతమైన తదుపరి తరం ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వాటిని సరైన సమయంలో కార్యాచరణలోకి తెస్తామని చెప్పారు. ఇటీవలి యుద్ధంలో స్వల్ప–శ్రేణి వ్యూహాత్మక లేజర్‌ వ్యవస్థలను మోహరించామని, అవి డజన్ల కొద్దీ లక్ష్యాలను విజయవంతంగా అడ్డగించాయని గోల్డ్‌ ప్రకటించారు. ఇజ్రాయెల్‌ రక్షణ శ్రేణిలోకి ఐరన్‌ డోమ్‌ అదనంగా చేరనుందన్నారు. దీని నిర్వహణ వ్యయం చాలా తక్కువని వివరించారు. 
 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)