Breaking News

నిండుకుంటున్న ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు

Published on Thu, 06/19/2025 - 06:03

టెల్‌ అవీవ్‌:  ఇరాన్‌పై యుద్ధంలో తమపై పైచేయి అవుతోందని, ఇరాన్‌ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్‌ పదేపదే చెప్పుకుంటోంది. కానీ, యుద్ధాన్ని కొనసాగించడానికి కావాల్సిన సాధన సంపత్తి రోజురోజుకీ తరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్‌ క్షిపణులను నేలకూల్చడానికి అవసరమయ్యే లాంగ్‌రేంజ్‌ మిస్సైల్‌ ఇంటర్‌సెప్టర్ల సరఫరా తగ్గిపోతోంది.

 ఇజ్రాయెల్‌ వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు తగినంతగా లేవని అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ సైన్యం శుక్రవారం ఇరాన్‌పై ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ ప్రారంభించింది. గత ఆరు రోజులుగా ఇరుదేశాల మధ్య నిరంతరం క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్‌ సైన్యం ఇజ్రాయెల్‌పై దాదాపు 400 బాలిస్టిక్‌ మిస్సైళ్లు ప్రయోగించింది. వీటిలో చాలావరకు మిస్సైళ్లను ఇజ్రాయెల్‌ సైన్యం మధ్యలోనే కూల్చివేసింది. 

ఇజ్రాయెల్‌ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్‌ వద్ద ఇంకా 1,600 ఉన్నాయి. యుద్ధం ఇలాగే  కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్‌పై ప్రయోగించే అవకాశం ఉంది. కానీ, వాటన్నింటినీ కూల్చే ఇంటర్‌సెప్టర్లు ఇజ్రాయెల్‌ వద్ద లేవు. అమెరికా నుంచి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు తక్షణమే అందకపోతే ఇరాన్‌పై యుద్ధం కొనసాగించే పరిస్థితి ఉండదని ఇజ్రాయెల్‌ రక్షణ రంగ నిపుణులు తేల్చిచెబు తున్నారు. ఇప్పుడున్న సిస్టమ్స్‌ మరో 10 నుంచి 12 రోజు ల వరకు మాత్రమే సరిపోతాయని అంటున్నారు. అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.  
 

Videos

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)