Breaking News

ఇరాన్‌ మిసైల్‌ దాడులు: తొలిసారి స్పందించిన నెతన్యాహు

Published on Sun, 04/14/2024 - 18:46

జెరూసలెం: తమ దేశం మీద డ్రోన్‌లు, మిసైళ్లతో ఇరాన్‌ జరిపిన దాడులపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం(ఏప్రిల్‌14) స్పందించారు. ఇరాన్‌ దాడులకు ఎలా స్పందించాలనేదానిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన వార్‌ క్యాబినెట్‌ భేటీకి వెళ్లే ముందు నెతన్యాహు మాట్లాడారు.‘మేం అడ్డుకున్నాం. కూల్చివేశాం. కలిసికట్టుగా గెలుస్తాం’అని ఇరాన్‌ డ్రోన్‌లు, మిసైళ్లను అమెరికా,బ్రిటన్‌ సహకారంతో కూల్చివేయడంపై స్పందించారు.

కాగా శనివారం(ఏప్రిల్‌13)అర్ధరాత్రి ఇరాన్‌,ఇజ్రాయెల్‌పై వందల కొద్ది డ్రోన్‌లు, మిసైళ్లతో దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ఇజ్రాయెల్‌ ఎలా స్పందిస్తునేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ‘ఇజ్రాయెల్‌ మిలిటరీ యాక్షన్‌ ఇంకా ముగియలేదు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం’అని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ మంత్రి యోవ్‌ గల్లాంట్‌ అన్నారు.

కాగా, సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇటీవల ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్‌ మిలిటరీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్‌లు, మిసైళ్లతో దాడులకు దిగింది.

ఇదీ చదవండి.. ఇరాన్‌ దాడులు.. ఇజ్రాయెల్‌కు పోప్‌ కీలక సూచన 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)