Breaking News

ఖాన్‌ యూనిస్‌ను వెంటనే ఖాళీ చేయండి.. ఇజ్రాయెల్‌ ఆర్మీ ఆదేశం

Published on Tue, 07/02/2024 - 07:37

గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం భారీగా దాడులకు పాల్పడటానికి  సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ గాజాలోని రెండో అతిపెద్ద నగం అయిన ఖాన్‌ యూనిస్‌లో దాడుల స్థాయిని పెంచనున్నట్ల సమాచారం.  ఈ మేరకు ఖాన్‌ యూనిస్‌లో ఉండే పాలస్తీనియన్లు వెంటనే  ఖాళీ చేయాలని సోమవారం ఇజ్రాయెల్‌ ఆర్మీ  ఆదేశాలు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది పాస్తీనియన్లు ఇతర ప్రాంతాకు తరలివెళ్తుతున్నారు. దీంతో ఖాన్‌ యూనిస్‌లోని యూరోపియన్‌ ఆస్పత్రిలోని పేషెంట్లను సైతం  ఇతర ప్రాంతాలకు బలవంతంగా తరలిస్తున్నారు.  గతవారం ఉత్తర గాజాలోని  షెజాయా నగరంలో ప్రజలకును ఖాళీ చేయమన్న ఇజ్రాయెల్‌ ఆర్మీ.. ఐదో రోజు కూడా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. దక్షిణ రఫా ప్రాంతంలో జరిగన దాడుల్లో  ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు మృతి  చెందాడు.

హమాస్‌ను అంతం చేసే దశలో  ఇజ్రాయెల్‌ పురోగతి సాధింస్తోందని  ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నాడు. అయితే  ఇతర ప్రాంతాల్లో కూడా దాడుల తీవ్రత పెంచాలని ఆర్మీకి సూచించారు. అయితే  ఈ నేపథ్యంలోనే ఖాన్‌ యూనిస్‌లో మళ్లీ దాడులకు ఇజ్రాయెల్‌ ఆర్మీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.   ఇజ్రాయెల్‌ ఆర్మీ హమాస్‌ మిలిటెంట్లను అంతం చేయటంలో భాగంగా  ఈ ఏడాది మొదట్లో ఖాన్‌ యూనిస్‌ నగరంపై ఇజ్రాయెల్‌ ఆర్మీ భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉండే పాలస్తీనా ప్రజలు  దక్షిణ గాజా నగరమైన రఫాకు  తరలివెళ్లారు.

అక్టోబర్‌ 7న హమాస్‌  బలగాలు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1200 మృతి చెందగా.. 251 మందిని  బంధీలుగా  తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌  హామాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై  విరచుకుపడుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పవరకు 37,900 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.

చదవండి: ట్రంప్‌ విషయంలో కోర్టు తీర్పు ఎంతో ప్రమాదకరం: బైడెన్‌

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)