Breaking News

Israel-Iran Tensions: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు

Published on Sun, 04/14/2024 - 05:29

జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘా లు కమ్ముకుంటున్నాయి. యూదు దేశం ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్‌ దేశం ఇరాన్‌ ప్రతీకారంతో రగిలిపోతోంది. సిరియా రాజధాని డెమాస్కస్‌లో తమ దౌత్య కార్యాలయంపై దాడి చేసి, ఇద్దరు ఉన్నతస్థాయి సైనికాధికారులను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పాలన్న కృతనిశ్చయంతో ఇరాన్‌ ఉంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ సైన్యం ఏ క్షణమైనా దాడికి దిగొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా వెల్లడించారు.

ఇజ్రాయెల్‌లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ అత్యాధునిక డ్రోన్లు, రాకెట్లు ప్రయోగించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం సన్నాహాలు ప్రారంభించింది. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసింది. ఇజ్రాయిల్‌ దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. యాంటీ మిస్సైల్‌ మొబైల్‌ లాంచర్లను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్‌పై దాడికి దిగితే సహించబోమని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించింది. ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికా తన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు తెలిసింది. టెహ్రాన్‌ నుంచి తమ విమానాల రాకపోకలను ఈ నెల 18వ తేదీ వరకూ రద్దు చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ తెలియజేసింది. ఇజ్రాయెల్, ఇరాన్‌ దేశాల్లో ఉన్న తమ పౌరులకు కొన్ని దేశాలు ప్రయాణ అడ్వైజరీలు జారీ చేశాయి.

ఆ నౌకలో భారతీయులు
17 మంది భారతీయ నావికులు ఉన్న ఇజ్రాయెల్‌ కంటైనర్‌ షిప్‌ను ఇరాన్‌ పారామిలటరీ రివల్యూషనరీ గార్డు కమాండోలు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్‌ గల్ఫ్‌లోని హొర్మూజ్‌ జలసంధిలో ఈ సంఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్‌ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సీ ఏరీస్‌ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్‌ జెండా ఉంది. ఇది ఇజ్రాయెల్‌లోని జొడియాక్‌ గ్రూప్‌నకు చెందిన నౌక. ఇరాన్‌ కమాండోలు సోవియట్‌ కాలం నాటి మిల్‌ ఎంఐ–17 హెలికాప్టర్‌ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన  దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్‌ కమాండోల దుశ్చర్యపై ఇజ్రాయెల్‌ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్‌ కమాండోలు స్వా«దీనం చేసుకున్న కంటైనర్‌ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. దౌత్యమార్గాల్లో ఇరాన్‌ను అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నాయి.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)