Breaking News

Israel-Hamas war: యుద్ధమేఘాలు!

Published on Sun, 08/04/2024 - 04:27

టెల్‌అవీవ్‌/వాషింగ్టన్‌: పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్‌ హెచ్చరికలు అగ్గి రాజేశాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ క్రూయిజర్లు, డి్రస్టాయర్లు, ఎఫ్‌–22 ఫైటర్‌ జెట్‌ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది.

 పసిఫిక్‌ సముద్రంలో ఉన్న విమానవాహక నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ను కూడా తరలించాల్సిందిగా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఆదేశించారు. మిసైల్‌ డిఫెన్స్‌ బలగాలకు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు వెళ్లాయి. ఇరాన్‌ సమీపంలో భూతల బాలిస్టిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను మోహరించే ప్రయత్నాలు కూడా జోరందుకున్నాయి. 40 ఎఫ్‌ఏ–18 సూపర్‌ హార్నెట్, ఎఫ్‌–35 అటాక్‌ ప్లేన్లతో కూడిన విమానవాహక నౌక థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ అరేబియా తీర సమీపంలో; 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, 4,500 మంది మరైన్లు, నావికా దళ సభ్యులతో కూడిన యూఎస్‌ఎస్‌ వాస్ప్‌ కూడా తూర్పు మధ్యదరా సముద్రంలో పహారా కాస్తున్నాయి. 

మరో హమాస్‌ నేత హతం 
శనివారం గాజాపై వైమానిక దాడుల్లో హమాస్‌ సైనిక విభాగ కీలక నేత హైథమ్‌ బలిదీతో పాటు డజన్లకొద్దీ పాలస్తీనియన్లు మరణించినట్టు సమాచారం. వెస్ట్‌బ్యాంక్‌లో 9 మంది పాలస్తీనా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

ఇజ్రాయెల్‌ కోసం ఎందాకైనా: అమెరికా 
ఇజ్రాయెల్‌కు దన్నుగా నిలిచేందుకు అవసరమైతే మరిన్ని చర్యలూ చేపడతామని పెంటగాన్‌ తాజాగా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ వాతావరణ నెలకొనడం ఈ ఏడాది ఇప్పటికే ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ దేశవ్యాప్త హై అలర్ట్‌ ప్రకటించింది. అయితే ఉద్రిక్తలు పెరగడం ఎవరికీ మంచిది కాదని పెంటగాన్‌ అధికార ప్రతినిధి సబ్రీనాసింగ్‌ అన్నారు. మధ్యప్రాచ్యంలో తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యొవ్‌ గాలంట్‌తో లాయిడ్‌సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు