ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్‌ ఎలా జరుగుతుంది?

Published on Thu, 11/02/2023 - 09:29

ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరువైపులా వేలాది మంది ప్రజులు మృతి చెందారు. ప్రస్తుతం ఈ యుద్ధాన్ని ఆపడం యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారింది. అమెరికా నుంచి బ్రిటన్ వరకు పలు దేశాలు ఇందుకోసం ప్రయత్నించాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్-హమాస్ విషయమై ఒక ప్రతిపాదన వచ్చింది. దీనికి సంబంధించిన ఓటింగ్‌లో భారత్‌ పాల్గొనలేదు. ఇంతకీ ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ)లో ఓటింగ్ ఎలా జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం  సమయంలో మాదిరిగానే భారత్ ఈసారి కూడా ఐక్యరాజ్య సమితిలోని ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఇజ్రాయెల్-హమాస్‌ వివాదంపై రూపొందించిన ఈ ప్రతిపాదనలో వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించడం, గాజాలోని బాధితులకు ఉపశమనం కల్పించడం, కాల్పుల విరమణ, బందీల విడుదల తదితర అంశాలు ఉన్నాయి. జోర్డాన్ ఈ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టింది.

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఏ దేశమైనా తన ప్రతిపాదనను సమర్పించవచ్చు. దీనిపై ఓటింగ్ జరగాలా వద్దా అనేదానిని యూఎన్‌ఓ చైర్మన్ నిర్ణయిస్తారు. ప్రతిపాదనను ఆమోదించడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం ప్రపంచంలోని 193 దేశాలు ఐక్యరాజ్యసమితిలో సభ్యులుగా ఉన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ కేసులో తీసుకొచ్చిన తీర్మానానికి 120 ఓట్లు వచ్చాయి. అంటే మెజారిటీ వచ్చింది. ఎటువంటి పరిస్థితులనైనా శాంతియుతంగా పరిష్కరించడం కోసం సిఫార్సులు చేయడం యూఎన్‌జీఏ పని. తీర్మానం ఆమోదం కోసం వచ్చినప్పుడు ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల స్టాండ్ ఏమిటో తెలుస్తుంది. తరువాత యుద్ధంలో పాల్గొన్న దేశానికి నైతిక సందేశం పంపిస్తారు. యూఎన్‌జీఏ ఏ దేశాన్నీ చట్టబద్ధంగా కట్టడి చేయదు. దీని కోసం యూఎన్‌ఎస్‌సీని రూపొందించారు. 
ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో ఎక్కువ పనిగంటలు?

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)