Breaking News

హెజ్‌బొల్లా ర‌హ‌స్య బంక‌ర్‌లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు

Published on Tue, 10/22/2024 - 10:20

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అటు హమాస్‌​, హెజ్‌బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రయెల్‌ క్షిపణి దాడులతో విరుచుకుపడుతుంది. ఇటీవల హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ను చంపిన  ఇజ్రాయెల్‌.. ఈసారి హెజ్‌బొల్లా ఆర్థిక ఆస్తులను టార్గెట్‌ చేసింది. 

ఈ క్రమంలో హెజ్‌బొల్లా ర‌హస్య బంక‌ర్‌ను  ల‌క్ష్యంగా చేసుకొని చేసిన దాడిలో.. భారీగా బంగారం, నోట్ల గుట్ట‌లు ఉన్న‌ట్లు గుర్తించింది.  . ఓ ఆస్ప‌త్రి కింద ఉన్న ర‌హ‌స్య సొరంగంలో మిలిటెంట్ గ్రూప్‌న‌కు సంబంధించి భారీగా బంగారం, నోట్ల గుట్ట‌లు ఉన్న‌ట్లు ఇజ్రాయెల్‌  డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్)  వీడియో విడుద‌ల చేసింది.

ఈ మేర‌కు ఐడీఎఫ్ అధికార ప్ర‌తినిధి డేనియ‌ల్ హ‌గారీ మాట్లాడుతూ.. హెజ్‌బొల్లా ఆర్థిక వ‌న‌రుల‌పై వ‌రుస‌గా దాడుల‌కు పాల్ప‌డుతున్నాం. ఆదివారం రాత్రి జ‌రిపిన దాడుల్లో ఓ బంక‌ర్‌ను ధ్వంసం చేశాం. ఆ ర‌హ‌స్య బంక‌ర్‌లో భారీగా బంగారం, వేల డాల‌ర్ల న‌గ‌దును గుర్తించాం. ఇజ్రాయెల్‌పై దాడుల‌కు ఈ న‌గ‌దునే వినియోగిస్తున్న‌ట్లు స‌మాచారం ఉంది. 

ఈ మిలిటెంట్ గ్రూప్‌న‌కు బీరుట్ న‌డిబొడ్డున మ‌రో ర‌హ‌స్య బంక‌ర్ ఉంది. అల్ – సాహెల్ ఆస్ప‌త్రి కింద ఉన్న ఆ ర‌హ‌స్య బంక‌ర్‌లో వంద‌ల మిలియ‌న్ల కొద్దీ డాల‌ర్లు, బంగారం గుట్ట‌లు ఉన్న‌ట్లు తెలిసింది. ఆ బంక‌ర్‌పై ఇంకా తాము దాడుల‌కు పాల్ప‌డలేదని, ఆ బంక‌ర్‌లో 500 బిలియ‌న్ డాల‌ర్ల న‌గ‌దు(రూ. 4,200 కోట్ల‌కు పైగా) ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నామని హ‌గారీ పేర్కొన్నారు.  ఈ సందర్భంగా బంకర్‌ ఉన్న ప్రాంతం మ్యాప్‌ను కూడా చూపించారు. 

అయితే బంక‌ర్ ఉన్న ప్రాంతంలోని ఆస్ప‌త్రిపై దాడుల‌కు పాల్ప‌డ‌మ‌ని, త‌మ యుద్ధం కేవ‌లం హెజ్‌బొల్లాతో మాత్ర‌మే అని హ‌గారీ స్ప‌ష్టం చేశారు. లెబ‌నీస్ పౌరుల‌కు ఎలాంటి హానీ క‌లిగించ‌మ‌ని పేర్కొన్నారు. మొత్తానికి ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆస్ప‌త్రిని అధికారులు ఖాళీ చేయిస్తున్న‌ట్లు స‌మాచారం.
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)