Breaking News

ట్రంప్‌ మాటను లెక్కచేయకుండా!! గాజాలో మళ్లీ..

Published on Sat, 10/04/2025 - 15:15

ట్రంప్‌ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాస్‌ సిద్ధంగా ఉందని.. బందీల విడుదలకు అంగీకరించిందిని.. గాజాలో దాడులు ఆపాలని.. అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటను లెక్కచేయకుండా మళ్లీ దాడులు కొనసాగిస్తోంది. శనివారం గాజాలో ఇజ్రాయెల్‌ బలగాలు జరిగిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. 

బందీల విడుదలతో పాటు ట్రంప్‌ ప్రతిపాదనలో పలు అంశాలకు హమాస్‌ అంగీకరించిందని.. అమెరికా ఈ యుద్ధాన్ని ముగించే దిశగా ముందుకు వెళ్తోందని ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. అటుపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు సైతం ‘ట్రంప్‌ గాజా ప్లాన్‌’(Trump Gaza Plan) తొలి దశ తక్షణమే అమలు కాబోతోందని అన్నారు. ఆ వెంటనే ఇజ్రాయెల్‌ ఆర్మీ చీఫ్‌ సైతం దీనిని ధృవీకరించారు. దీంతో పలు దేశాల అధినేతలూ ట్రంప్‌ కృషికి అభినందనలు తెలియజేశారు కూడా. అయితే.. 

అనూహ్యాంగా.. ఈ ప్రకటనలు వెలువడిన గంటల వ్యవధిలోనే గాజాపై ఇజ్రాయెల్‌ బలగాలు(Israel Attacks Gaza Agian) విరుచుకుపడ్డాయి. గాజా సిటీలో జరిపిన దాడుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా.. దక్షిణ భాగంలోని ఖాన్‌ యూనిస్‌ వద్ద మరో ఇద్దరు చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. అయితే తాజా దాడులపై ఇజ్రాయెల్‌, అమెరికా, హమాస్‌ వైపుల నుంచి స్పందన రావాల్సి ఉంది. 

2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ సరిహద్దులో హమాస్‌ సంస్థ జరిపిన మెరుపు దాడిలో 1,200 మంది మరణించారు. మరో 251 మంది బంధీలుగా తీసుకెళ్లారు. పాలస్తీనియన్ భూభాగాల్లో ఇజ్రాయెల్‌ సెటిల్‌మెంట్ల విస్తరణ.. వాళ్ల చేతుల్లో పాలస్తీనా పౌరులు హింసకు గురి కావడం, అల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలు, జెనిన్ శరణార్థి శిబిరంపై దాడులు.. ఈ వరుస పరిణామాలు హమాస్‌ దాడికి కారణాలు. ఈ భారీ దాడికి ప్రతిగా.. 

ఇజ్రాయెల్‌ గాజాపై ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 66, 000 మందికి పైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్భంధించి.. మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయెల్‌ బలగాలు చేశాయి. విద్యుత్‌ కొరత, తిండి, నీరు లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

అయితే తాము హమాస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నామని, పౌరులను రక్షణ కవచంలా వాళ్లు ఉపయోగించుకుంటున్నారంటూ ఇజ్రాయెల్‌ చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్‌ ఎంట్రీతో పరిస్థితి మారింది. అదే సమయంలో బంధీల విడుదల కోసం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. ఈ తరుణంలో.. 

ట్రంప్‌ ప్రతిపాదించిన 20-పాయింట్ల శాంతి ఒప్పందానికి హమాస్‌ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం 48 మంది బంధీలు ఉన్నారని, వారిలో 20 మంది జీవించి ఉన్నారని తెలుస్తోంది.  తొలి దశలో భాగంగా.. బంధీల విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపింది.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)