Breaking News

చాలా వెతికాం.. కనిపిస్తే కథ ముగించేవాళ్లం: ఇజ్రాయెల్‌

Published on Fri, 06/27/2025 - 10:33

ఇజ్రాయెల్‌ మరోసారి సంచలన ప్రకటన చేసింది.  ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీ కోసం చాలా వెతికామని, ఆయన కనబడితే కచ్చితంగా చంపేవాళ్లమని అంగీకరించింది. అయితే ప్రాణ భయంతోనే ఖమేనీ పారిపోయి దాక్కున్నారంటూ ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన కోసం చాలా చోట్ల వెతికామని, జాడ తెలిసి ఉంటే కచ్చితంగా మట్టుపెట్టేవాళ్లమని, కానీ ఆ విషయం తెలుసుకున్న ఖమేనీ లోతైన బంకర్‌లలో దాక్కున్నారని వ్యాఖ్యానించారాయన. 

ఖమేనీని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాం. కానీ, ఆయన సురక్షితంగా ఎక్కడో బంకర్‌లో దాక్కుని క్షిపణి దాడులు చేయించారు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం కిందకే వస్తుంది అని కాట్జ్‌ అభిప్రాయపడ్డారు. అయితే భవిష్యత్తులో అలాంటి ప్రయత్నాలు సాగుతాయా? అనే ప్రశ్నకు.. ఆయన మౌనం వహించారు.  

ఇదిలా ఉంటే.. ఖమేనీపై కాట్జ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. టెల్ అవీవ్‌పై జూన్‌ 14వ తేదీన ఇరాన్‌ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 47 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన కాట్జ్‌.. ఖమేనీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఖమేనీకి ఇక భూమ్మీద ఉండే హక్కు లేదు అని, ఖమేనీ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని ఆ సమయంలో కాట్జ్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు కూడా ఖమేనీపై విరుచుకుపడ్డారు. ఖమేనీ అభినవ హిట్లర్‌ అని, ఆయన ప్రాణాలతో లేకుంటేనే శాంతి నెలకొంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

అయితే అమెరికా మాత్రం ఖమేనీ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందని చెబుతూ.. ఆయన్ని చంపే ఉద్దేశం లేదని, బేషరతుగా లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. ఖమేనీ తనకు వస్తున్న బెదిరింపులను తేలికగానే తీసుకుంటూ వచ్చారు. ఇరాన్ ఎప్పటికీ లొంగదు, బెదిరింపులకు భయపడదు అని సోషల్‌ మీడియాలో, ఇటు టెలివిజన్ ప్రసంగంలో పేర్కొంటూ వస్తున్నారు.

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఉద్రిక్తతలు ప్రారంభం అయ్యాక.. ఆయన టెహ్రాన్‌ను వీడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలతో సంబంధాలు లేకుండా.. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు దూరంగా..  గట్టి భద్రత మధ్య ఆయన సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ తర్వాత ఆయన జాడ లేదంటూ ఇరాన్‌ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన తాజాగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అయితే అందులో 86 ఖమేనీ కాస్త నీరసంగా కనిపించారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)