Breaking News

ఇరాన్‌కు టెన్షన్‌.. ఖమేనీ టార్గెట్‌గా విరుచుకుపడిన ఇజ్రాయెల్‌

Published on Sat, 06/14/2025 - 09:45

టెహ్రాన్‌: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా రెండు దేశాలు పరస్పర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు పెంచింది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దాడుల కారణంగా ఇప్పటికే 78 మంది ఇరాన్‌ పౌరులు మృతి చెందగా.. 329 మంది గాయపడ్డారు. ఇక, ఇజ్రాయెల్‌లో ఒకరు మృతి చెందగా.. 39 మంది గాయపడినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌ టాప్‌ లీడర్లే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్‌ (Iran) సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. టెహ్రాన్‌లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్‌ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఈ క్రమంలోనే అక్కడ దాడులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

మరోవైపు.. ఇరాన్‌ మిలిటరీ చీఫ్‌గా అమీర్‌ హతామీని నియమించినట్లు ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌ మిలిటరీ చీఫ్‌ మహమ్మద్‌ బాఘేరి మృతిచెందిన విషయం తెలిసిందే. 2013 నుంచి 2023 వరకు హతామీ దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆపరేషన్‌ ‘రైజింగ్‌ లయన్‌’ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ పెద్దఎత్తున దాడులకు దిగింది. ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో టెహ్రాన్‌ పలు కీలకమైన మిలిటరీ అధికారులను, అణుశాస్ర్తవేత్తలను కోల్పోయింది. దీనికి టెహ్రాన్‌ ప్రతిదాడులను కూడా చేసింది.

Magazine Story‪: భీకర యుద్ధం.. భయానకం

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం వేళ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందించారు. గుటెర్రస్ ట్విట్టర్‌ వేదికగా.. ఇరు దేశాలు ఉద్రిక్తతలను ఆపాలని పిలుపునిచ్చారు. శాంతి, దౌత్య మార్గంలో చర్చలు జరపాలన్నారు. దాడులు ఆపాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)