Breaking News

ట్రంప్‌ ఖాతాలోకి కాల్పుల విరమణ క్రెడిట్?

Published on Tue, 06/24/2025 - 09:52

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్‌ తాజాగా ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన కారణంగానే కుదిరిందంటూ.. ఆ క్రెడిట్‌ తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేశారు.  ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ‘ఇజ్రాయెల్ - ఇరాన్  ఒకేసారి తన దగ్గరకు వచ్చి, శాంతి నెలకొల్పాలని కోరాయని పేర్కొన్నారు. ఆ క్షణంలో ఆ దేశాల ఆవశ్యకతను తాను గుర్తించానని, ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని గ్రహించానని పేర్కొన్నారు. ఈ విధమైన నిర్ణయం ఆ రెండు దేశాలకే కాకుండా,  ప్రాంతీయంగా సాధించిన విజయంగా అభివర్ణించారు.

ప్రపంచ వేదికపై తనను తాను డీల్ మేకర్‌గా చెప్పుకుంటున్న ట్రంప్‌ ఈ రెండు శత్రుదేశాల మధ్య కొత్త అధ్యాయానికి గల అవకాశాలను  వివరించారు. ఈ దేశాలు భవిష్యత్తులో అపారమైన పరస్పర ప్రేమ, శాంతి  శ్రేయస్సును చవిచూస్తాయన్నారు. ఇజ్రాయెల్ - ఇరాన్‌లకు అద్భుతమైన భవిష్యత్‌ ఉంది. దేవుడు  ఆ దేశాలను దీవించాలని కోరుకుంటూ  ట్రంప్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణలు మరింతగా పెరిగిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ఆ దేశాల మధ్య  కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో కీలక పాత్ర పోషించారని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌లు ఇరానియన్  నేతలతో  దౌత్య మంతనాలు నిర్వహించారన్నారు. ఇరు దేశల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం ఒక కీలక షరతుపై ఆధారపడి ఉందని  సమాచారం. ఇరాన్ ఇకపై దాడులు చేయకుండా ఉంటే ఇజ్రాయెల్ తన సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తుందనేదే ఆ షరతు అని తెలుస్తోంది. ఇరాన్ తన దాడులను నియంత్రించేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలిచ్చిందని,  తక్షణ దాడులకు ప్రణాళికలు లేవని  అమెరికన్‌ అధికారి ఒకరు తెలిపారు. రెండు దేశాల మధ్య సమన్వయ సాధనలో ట్రంప్ ప్రత్యక్ష ప్రమేయంతో  ఈ పురోగతి సాధ్యమయ్యిందని ఆయన పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: ‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు’: ట్రంప్ ప్రకటనపై ఖమేనీ మండిపాటు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)