Breaking News

ఇక అణ్వాయుధాల జోలే లేదు.. నెతన్యాహు

Published on Tue, 06/16/2026 - 07:39

టెల్‌ అవీవ్‌: ప్రస్తుతం పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీస్తున్నాయి. అమెరికా,ఇరాన్‌ల మధ్య డీల్‌ కుదరడంతో ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజిమిన్‌ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగే ఉండే అవకాశం లేదన్నారు. అది ఈ రోజైనా..రేపైనా అని స్పష్టం చేశారు.  

శాంతి ఒప్పందంపై ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో అసంతృప్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఆ దేశ ప్రజలకు వివరణ ఇచ్చారు. ఇరాన్‌పై యుద్ధం విషయంలో తాను చేసింది సరైందేనని సమర్థిస్తూ మాట్లాడారు. "మనం ఏమి సాధించామని ప్రజలు నన్ను అడుగుతున్నారు? దానికి నేను సమాధానమిస్తాను - మనం ఏమి సాధించాం? మనపై ఉన్న తక్షణ వినాశన ముప్పును మనం తొలగించుకున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా, ఇజ్రాయెల్ రాజ్యాన్ని సంపూర్ణ వినాశనం ముప్పు నుండి కాపాడాం" అని అన్నారు. శత్రుదేశం ఇరాన్‌కు ఈ రోజే కాదు రేపు.. ఎప్పుడూ అణ్వాయుధాలు ఉండవు. అని నెతన్యాహు పేర్కొన్నారు.

తాము ఇజ్రాయెల్ దేశం చుట్టూ పటిష్టమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేశామని. గాజా, లెబనాన్ మరియు సిరియాలలో కూడా మేము ఇదే చేశామని అన్నారు. తాను ఒక నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నానని ఇజ్రాయెల్‌కు అవసరమైనంత కాలం తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి అవసరమైనంత కాలం మేము ఈ భద్రతా మండలాల్లోనే ఉంటామని నెతన్యాహూ తేల్చి చెప్పారు.

ట్రంప్‌తో విభేదాలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో గల విభేదాలపై స్పందించారు. కొన్నిసార్లు అధ్యక్షుడు ట్రంప్‌కు, నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలను వివేకంతో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అని అన్నారు.

నెతన్యాహుపై విమర్శలు
ఇజ్రాయెల్‌లో నెతన్యాహు నాయకత్వాన్ని విమర్శిస్తూ విపక్ష నేత  నఫ్తాలి బెన్నెట్  మాట్లాడారు. నెతన్యాహూ అధికారం అంతర్యుద్ధంతో ప్రారంభమై, అక్టోబర్ 7 నాటి మారణకాండతో కొనసాగి, ఇప్పుడు ఇరాన్‌పై చారిత్రాత్మక వైఫల్యంతో ముగుస్తోంది ‍అని విమర్శించారు. ఈ వ్యతిరేకతల నేపథ్యంలో నెతన్యాహూ వివరణ ఇచ్చారు.

ఎట్టకేలకు శాంతి ఒప్పందం
కాగా గత మూడు నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు ముగింపు లభించింది. హార్మూజ్‌ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్‌ చారిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్‌ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్‌ ప్రకటించాయి.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)